ఎస్పీ సింధు శర్మ
( J. Surender Kumar )
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ, సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గా ఎస్పి మాట్లాడుతూ…. పెండింగ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని అన్నారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. SC/ST కేస్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 17 ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు….
జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఏవిధమైన చర్యలను తీసుకోవడం వలన ప్రమాదాలు తగ్గుతాయో అధికారులతో చర్చించారు.. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై భారీ కేడ్స్ ను పెట్టాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు. వాహన తనిఖీలు నిర్వహించిన ప్పుడు ఏ వాహనం పైన మూడు చాలన్స్ పెండింగ్ లో ఉన్నట్లయితే సదరు వాహనాన్ని సీజ్ చేయాలన్నారు.
కోర్టులో వివిధ కేసుల్లో నేరస్తులకు శిక్ష శాతం పెరిగే విధంగా కృషి చేసిన పిపి లు D.శ్రీవాణి, బాలత్రిపురసుందరి ,S .మురళి ఎస్పీ శాలువాతో సత్కరిచి అభినందించారు.
ఉత్తమ ప్రతిభను కనబరిచిన అదికారులకు …

ఈ సందర్బంగా విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 17 ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ ఉత్తమ ప్రతిభను కనబరిచిన 16 మంది అదికారులకు మరియు సిబ్బందికి యస్.పి ప్రశంశ పత్రం అందజేశారు. అదే విదంగా రోడ్డు ప్రమాదాలలు సంభవించినప్పుడు ఫస్ట్ రెస్పాండింగ్ గా ఉండేందుకు జిల్లాలోని పదిమంది కానిస్టేబుల్ లకు హైదరాబాదులోని జీవీకే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి సహకారంతో చీఫ్ ఆఫీసులో నిర్వహించిన ప్రాథమిక చికిస్థ ట్రైనింగ్ నందు పాల్గొన్న పదిమంది కానిస్టేబుళ్ల కు సర్టిఫికెట్స్ అందజేశారు.
ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రకాష్, రవీంద్ర రెడ్డి , .SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, CCS ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, మరియు సి.ఐ లు రమణమూర్తి, .శ్రీను, కోటేశ్వర్, కృష్ణకుమార్, .మరియు ఎస్.ఐ లు DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్, ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ!

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక ఎల్ఐసీ కార్యాలయ ఆవరణలో లయన్స్ క్లబ్ ధర్మపురి వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫండ్ ద్వారా ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షంతో పాటు గోదావరి నది వరదల కారణంగా నష్టపోయిన నిరుపేద కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ జిల్లా స్థాయి వారి సహాయ సహకారంతో మంగళవారం రోజు ఉదయం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ ఇందారపు రామకృష్ణ, ఇట్టి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ ధర్మపురి వారి ఆధ్వర్యంలో పలు స్వచ్చంద సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలుపుతూ..

అకాల వర్షం గోదావరి నది వరద కారణంగా నష్టపోయిన నిరుపేద కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువులతో పాటు, రెండు బెడ్ షీట్స్, ప్లేట్, గ్లాస్, ఇరవై ఐదు కిలోల బియ్యం, ఇరవై మంది నిరుపేద కుటుంబ సభ్యులకు, మూడు వేల ఐదు వందల రూపాయల విలువ కలిగిన వస్తు సామాగ్రి కిట్లను అందజేసినట్టు వారు తెలిపారు. వరదల సమయంలో ఫ్రీ మీల్స్ ఆన్ విల్స్ పథకంలో భాగంగా వరద బాధిత ప్రాంతాలలో వరద బాధితులకు అల్పాహారంతో పాటు భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేసి త్వరలోనే పంపిణీ చేస్తాం అని వారు ఇట్టి సందర్భంగా తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రెటరీ పైడి మారుతి, కోశాధికారి సిర్ప రాజయ్య, డీసీ జక్కు రవీందర్, డీసీ సంగి ఆనంద్, సభ్యులు డాక్టర్ శ్రీనివాస్, ఇందారపు రామన్న, సంగనభట్ల దినేష్, జక్కు దేవేందర్, .రంగ శంకరయ్య, రంగ హరినాథ్, గుణిశెట్టి రవీందర్, ఇనుగంటి వెంకటేశ్వర్ రావు, ఇనుగంటి వినోద్ రావు, ఇందారాపు రామ్ కిషన్, కశోజుల రాజేశ్వర్,.గందే శ్రీనివాస్ లతో పాటు, వరద బాధిత ప్రాంతాల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.