(J.Surender Kumar )
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన విశ్వేశ్వరయ్య మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో జగిత్యాల జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ ఇంజనీర్స్, వరుణ్ కుమార్, ADE గొలపల్లి, అశోక్, AE జగిత్యాల టౌన్ 1, కొడిమ్యల AE రఘునాథ్, మరియు చల్గల్ AE శ్రీధర్ లకు, ఉత్తమ ఇంజనీర్స్ గా అవార్డ్ ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీ. సి కమిషన్ చైర్మన్ వకుళబరణం కృష్ణ మోహన్, మరియు దైవజ్ఞ శర్మ లుముఖ్య అతిథులుగా హాజరయ్యారు
విద్యార్థులకు డిక్షినరీలు, పంపిణీ

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ కు చెందిన ఆడేపు వెంకటేష్ దంపతులు స్థానిక హై స్కూల్ లో పదవతరగతి విద్యార్థులకు . హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ తరఫున శుక్రవారం డిక్షనరీలు పంపిణీ చేశారు. తమ చిన్న కూతురు శ్రీని రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ZPHS హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ , ఉపాధ్యాయులు , ఆడేపు మల్లయ్య, ఆడేపు రమేష్, ఆడేపు అశోక్, ఆడేపు కృష్ణ, ఆర్షకోట బంటీ, బండారి రాజు మరియు హెల్పింగ్ ఆర్మీ మిత్రులు తదితరులు పాల్గొన్నారు