(J. Surender Kumar)
జగిత్యాల జిల్లా కేంద్రం లో ఆర్డీవో కార్యాలయం ముందు 61 వ రోజు కొనసాగుతున్న VRA ల నిరవధిక సమ్మె.కు
పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి. శుక్రవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు.
జగిత్యాల లో ఎంపీ సోయం బాబూరావు !

జిల్లా కేంద్రం లో జగిత్యాల నియోజకవర్గ బిజేపి నాయకులు డా.ఎడమల శైలేందర్ రెడ్డి, నీ ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాబూరావు తదితర నాయకులు కలిశారు. ఆయన వెంట గడ్డం నంది రెడ్డి, అమ్మ ఛానెల్ అధినేత, కంది శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, (నిర్మల్), .హరి నాయక్, (ఖానాపూర్), చాణక్య స్కూల్ అధినేత మనోహర్ రెడ్డి, మరియు జగిత్యాల బిజేవైయం అధికార ప్రతినిధి కుర్మా రమేష్, కిరణ్, తదితరులు ఉన్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం కు సన్మానం!

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా నియమితులైన జగిత్యాల మాజీ పురపాలక అధ్యక్షులు గిరి నాగభూషణం కు అభినందనలు తెలిపి జగిత్యాల మైనార్టీ నాయకులు, ex కౌన్సిలర్ మునీరుద్దీన్ మున్నా, నిహాల్, ఇజాస్, తాజుద్దీన్, రియాజ్ తదితరులు. సన్మానించారు.
పరామర్శ!

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత అరికొంతపు స్వామి రెడ్డి మాతృమూర్తి పరమాపదించగా శుక్రవారం వారిని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్-కరీంనగర్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు
చేప పిల్లల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !

ఈరోజు రాయికల్ పట్టణ పెద్ద చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 100% రాయితీ తో 1 లక్ష 40వేల ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,అనంతరం రాయికల్ పట్టణంలో బైపాస్ రోడ్డులో డివైడర్ లలో మొక్కలు నాటిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,.జిల్లా మత్స్య శాక అధికారి దామోదర్,.ఇరిగేషన్ EE నారాయణ రెడ్డి, కమిషనర్ సంతోష్,.గంగ పుత్ర సంఘం అధ్యక్షుడు రవీందర్, కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,గంగ పుత్రులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణం మనబడి కార్యక్రమంలో !

రాయికల్ పట్టణంలో మన బస్తీ మన బడి కార్యక్రమం లో భాగం గా జిల్లా,మండల పరిషత్ హై స్కూల్ కాంప్లెక్స్ లో ₹1 కోటి 31 లక్షల రూపాయలతో పాటశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ . అనంతరం పట్టణానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 4లక్షల రూపాయల విలువగల చెక్కులను, ముగ్గురు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన ₹ 3లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే అందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, ZPTC అశ్విని జాదవ్, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, పట్టణ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, రైతు బందు మండల కన్వీనర్ మోహన్ రావు, కమిషనర్ సంతోష్, EE నారాయణ రెడ్డి, DE భాస్కర్, కౌన్సిలర్ అనురాధా రమేష్, పేరెంట్స్ కమిటీ ఛైర్మెన్ లహరి, meo గంగాధర్, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు,అధ్యాపకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధు వాహనం ప్రారంభం !

జగిత్యాల రూరల్ మండల కల్లేడ గ్రామానికి చెందిన అంజి కి దళిత బందు పథకం ద్వారా మంజూరైన టాటా గూడ్స్ వాహనాన్ని లబ్ధిదారునికి ఎమ్మేల్యే క్వార్టర్స్ లో శుక్రవారం అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వర రావు, ఎంపీటీసీ పరశురామ్ గౌడ్,నాయకులు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం!

శుక్రవారం ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటి సమావేశం చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్ అధ్వర్యంలో పాలకవర్గ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశములో 1. జూన్ 2022 నుండి ఆగష్టు 2022 మాసములు ఆదాయ వ్యయాలు, 2. వివిధ గ్రామాల యందు ఉచిత పశు వైద్య శిభిరముల, పై చర్చ 3. మార్కెట్ యార్డు నందు ఈశాన్యము మూలాన గల పురాతన నీటి ట్యాంకు తొలగింపు పై చర్చ ,4. లైసెన్స్ లు లేకుండా కొనుగోళ్లు చేసే వ్యాపారుల పై కేసుల నమోదు చేయుట పై చర్చ తదితర అంశముల పై చర్చించారు. రైతులకు మేలు చేసే విధంగా కొనుగోళ్లు ఉండాలని కొంతమంది దళారులు లైసెన్స్ లేకుండా గ్రామాల్లో కొనుగోలు చేస్తూ, రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని కమిటీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.. .దీని పైన స్పందించిన చైర్మన్ దళారుల పైన కేసులు నమోదు చేయిస్తాం అన్నారు. ఇట్టి సమావేశములో పురపాలక సంఘ చైర్ పర్సన్ శ్రీ మతి సంగి సత్తమ్మ , జైన PACS చైర్మన్ సౌల్ల నరేష్ , మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ అక్కేనపెల్లి సునీల్ కుమార్ , మరియు పాలకవర్గ సభ్యులు మైనేని వెంకటి జంగ శ్రీనివాసు గ, మామిడి శ్రీనివాస్ , గైని మల్లేశం , మహమ్మద్ ఇక్రం, వీరవేని రాజ మల్లయ్య, చక్రాల శ్రీనివాస్ , శ్రీ పాయిల శ్రీనివాస్ , గాజుల సత్తయ్య , శ్రీ మతి అల్పట్ల లక్ష్మి , బొల్లం హరి ప్రసాద్ మార్కెట్ ఇంచార్జ్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ,మంత్రి కొప్పులకు పాలాభిషేకం !

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించడం పట్ల టిఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, ధర్మపురి మండల పరిషత్ అధ్యక్షుడు ఎడ్ల చిట్టిబాబు,బుగ్గారం మండల పరిషత్ అధ్యక్షురాలు బాలినేని రాజమణి, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, నాయకులు సౌల భీమయ్య, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.