ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్!
50 వేల డిమాండ్.. 30 వేలకు ఒప్పందం!


( J. Surender Kumar)
అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో లంచగొండి అధికారి చిక్కాడు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వం లో దాడులు నిర్వహించి ₹ 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా మున్సిపల్ కమిషనర్ ను పట్టుకున్నారు.₹ 50 వేల రూపాయల డిమాండ్ చేయగా ₹ ,30,000/- ఒప్పందం కుదిరినట్టు సమాచారం
.
వివరాలు ఇలా ఉన్నాయి

ఏసీబీ డీఎస్పీ భద్రయ్య & సిబ్బంది


కూరగాయల మార్కెట్ ₹ 2.71 కోట్లు, డంపింగ్ యార్డ్ ₹. 1.24 కోట్లతో నిర్మాణ పనులను కాంట్రాక్టర్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తి కాలేదు. ఇట్టి పనులకు రెండు సార్లు కాంట్రాక్టర్ బిల్లు పొందాడు. మిగిలిపోయిన నిర్మాణ పనులు చేయుటకు స్థానిక మున్సిపల్ కమిషనర్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ అంశంపై ఏప్రిల్ 4న కమిషనర్ కు కాంట్రాక్టర్ వినతి పత్రం ఇచ్చారు. తిరిగి ఈ నెల 4న మరో వినతిపత్రం ఇచ్చారు. కమిషనర్ అట్టి పనులు చేయుటకు ససేమిరా అంగీకరించలేదు. మీ కాంట్రాక్ట్ చేస్తున్న పనులు పర్యవేక్షించే సూపర్వైజర్ సత్యం ను సంప్రదించండి. అంటూ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ దశలో కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేశాడు. కోనరావుపేట్ కు చెందిన సూపర్వైజర్ సత్యం. (కాంట్రాక్టర్ బంధువు) పనులు పొడిగించుటకు మరోసారి కమిషనర్ ను సంప్రదించాడు. కమిషనర్ అనుమతి ఇవ్వడానికి ₹,50,000/- డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులు వివరించారు. కమిషనర్ ను ప్రాధేయపడగ. ₹ 30,000/- ఒప్పందం కుదిరింది.. మంగళవారం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డి.ఎస్.పి భద్రయ్య తన బృందంతో మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. కమిషనర్ చేతికి రసాయన పరీక్ష లు. నిర్వహించి నిర్ధారణ చేసుకుని అరెస్టు అరెస్టు చేసి ఎసిబి జైలుకు తరలించారు. సంబంధిత రికార్డులను స్వాధీన పరుచుకుని పరిశీలిస్తున్నట్టు సమాచారం.