జీవన్ రెడ్డి, రమణ
జగిత్యాల, పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో గాయత్రీ మాత, నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని కుటుంబ సమేతంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి , టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎల్. రమణ లు, అమ్మవారిని దర్శించుకున్నారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత అమ్మవారికి ఎమ్మెల్సీలు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు. నవదుర్గా ఆలయ నిర్మాణానికి తాను తన వంతు సహకారం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం సేవా సమితి సభ్యులు సన్మానించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈకార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
బియ్యం గింజ పై ఎల్ రమణ చిత్రం!
బియ్యం గింజ పై ఎల్ రమణ చిత్రం!

జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ , బియ్యపు గింజపై చెక్కిన ఎమ్మెల్సీ ఎల్ రమణ శిల్పం (చిత్రం) మంగళవారం ఎమ్మెల్సీ రమణ నివాసంలో వారికి బహుకరించారు. ఎమ్మెల్సీ గారు సూక్ష్మ కళాకారుడు దయాకర్ ను అభినందించారు.
పల్లెల అభివృద్ధి సంక్షేమమే సీఎంకేసీఆర్ ధ్యేయం!
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

బోయినిపల్లి మండల తడగోండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చొప్పదండి ఎమ్మెల్యే శంకర్, మంగళవారం భూమి చేసారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు.

2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు ₹ ఒక్క లక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నామని తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉందని అన్నారు.
ఆలయ నిర్మాణానికి సిమెంటు విరాళం!

ఆలయ నిర్మాణంకు 50 బస్తాల సిమెంట్ అందజేసిన జిల్లా బిజేపి సీనియర్ నాయకులు చిలకమర్రి మదన్ మోహన్
తన సొంత గ్రామమైన రాయికల్ మం. తాట్లవాయి లో నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయ నిర్మాణం కోసం గ్రామస్తులు, మదన్ మోహన్ ను సంప్రదించగా
50 బస్తాల సిమెంటు గ్రామానికి పంపించారు, ఈ సందర్భంగా గ్రామస్తులు మదన్ మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు, ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం పూర్తయ్య వరకు తన పూర్తి సహకారం ఉంటుందని మదన్ మోహన్, గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
పరామర్శలు!

జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు గోపు రాజన్న, గత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లో చికిత్స పొంది రాగా ఆయన్ను

పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ,ఎమ్మెల్సీ ఎల్. రమణలు పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.
అమ్మవారి దర్శనం!
అమ్మవారి దర్శనం!

పట్టణంలోని పురాణిపేట లో రాజ్ పుత్ (బొందిలి) సంఘము ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గా అమ్మవారిని మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్య ఠాకూర్, మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు..
జగిత్యాల :
విద్యా నిధికి ₹ 50 వేల విరాళం !

జగిత్యాల వెలమ సంక్షేమ మండలి విద్యా.నిధికి మల్యాల మం. ముత్యంపేట వాస్తవ్యులు కీ.శే. ఎన్నమనేని పద్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎన్నమనేని వంశీ, కుమార్తె తక్కల్లపెల్లి హరిత-అరవింద్ రావు, మరియు కీ శే పద్మ గారి భర్త ఎన్నమనేని రాజేశ్వరరావు లు ₹ 50 వేల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ మండలి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి , యాచమనేని వెంకటేశ్వరరావు, ప్రధాన బోయిని పెల్లి ఆనందరావు ఉపాధ్యక్షులు బొంకురి గంగారావు, సంఘటిత కార్యదర్శి నీలగిరి రాజేందర్ రావు, కార్యవర్గ సభ్యులు గోపాడి సురేందర్ రావు, సందెల మల్లాల్ రావు వక్రాల కిరణ్ రావు, ఐల్నేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు