(J. Surender Kumar)
కార్తీకమాసం సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో పవిత్ర గోదావరి నదికి అంగరంగ వైభవంగా హారత కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బుధవారం స్థానిక మహిళలలచే, కోలాట నృత్యాలతో, శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం నుండి మేళతాళాలతో గోదావరి నదివరకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చారు. అనంతరం గోదావరి నదిలొ దీపాలు ఏర్పాటుచేసి ప్రత్యేక వేద పండితులతో ప్రత్యేక పూజ నిర్వహించారు

. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య , గునిశెట్టి రవీందర్ , సంగెం సురేష్ , .ఇనగంటి రమ వెంకటేశ్వరరావు, గందె పద్మశ్రీనివాస్, పల్లెర్ల సురేందర్ , వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్ కుమార్, .ఉప ప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచారి, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్ , మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ , మున్సిపల్ కమిషనర్ రమేశ్ , అర్చకులు, సిబ్బంది మహిళలు పాల్గొన్నారు .
ఆలయంలో సంప్రోక్షణం!

సూర్యగ్రహణం అనంతరం ఆలయంలో బుధవారం ఉదయం ప్రదాన దేవాలయంతో పాటు అన్ని అనుభంద దేవాలయములలో సంప్రోక్షణ, హోమం, పూర్ణాహుతిలతో పాటు అభిషేకం, హారతి, మంత్రపుష్పం, కార్యక్రమలు నిర్వహించిన అనంతరం దర్శనములు. ప్రారంభించారు
గురువారం యమద్వితీయ !

దేశంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం లో వెలసియున్న శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయ అవరణలో కొలువైయున్న ” శ్రీ యమధర్మరాజు” వారి ఆలయం లో రేపు యమద్వితీయ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
