అంజన్న ఆదాయమును అడ్డుకుంటున్నది ఎవరు?

ఇంచార్జ్ అధికారులదే ఇష్టారాజ్యమా !


( J.Surender Kumar)
ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంకు రావలసిన ఆదాయం అడ్డుకుంటున్నది ఎవరు ? ఇన్చార్జి అధికారుల పాలనలో ఇష్టారాజ్యంగా ఖర్చులు చేసినట్టు రికార్డులో ఉన్న వివరాలే విస్మయం కలిగిస్తున్నా. నిదర్శనాలు ఉన్నాయి.

సాలీనా ఆలయహుండీ, ప్రత్యేక పూజలు, హనుమాన్ దీక్షలు, ప్రసాదాల అమ్మకాలు, వాహన పూజల, తో పాటు తలనీలాల సేకరణ, ఆలయ ప్రాంగణంలో వివిధ వ్యాపారాల దుకాణాలు నిర్వహించుకునేందుకు వేలం తదితర మార్గాల ద్వారా సాలీనా దాదాపు ₹ 20 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.


వసూళ్లకు వణుకుతున్నారా ?
ఆలయంకు బకాయపడిన డబ్బులు, వేలం పాటదారుల నుండి వసూలుకు అధికారులు, సిబ్బంది వారిని చూసి వణికి పోతున్నట్టు? ఆరోపణలు వినిపిస్తున్నాయి. బకాయి సొమ్ము వసులుకు ఆలయ కార్యనిర్వహణాధికారి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తే,వారు అమలు పరచడం లేదా ? ఈవో ఆదేశాలను సిబ్బంది పాటించకుంటే వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు ? లేక రాజకీయ ఒత్తిడితోనా, ఆలయ ఈవో తమ ఉద్యోగ పదవీకాలంను పదిలం కోసమా ? తెలియదు కానీ బకాయి సొమ్ము వసూలు విషయంలో అధికారుల ఉదాసీన వైఖరితో ఆలయానికి రావలసిన డబ్బులకు అడ్డుకట్ట పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బినామీలే వేలం పాటదారులా ?


అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకుల అనుచర గణంలో కొందరు, సమాజంలో పెద్దలుగా చలామణి అవుతున్న కొందరు బినామీ. పేర్లతో వేలం పాటలో వ్యాపారాల నిర్వహణ కోసం కొన్ని దుకాణాలు, ఆలయం కు సంబంధించిన, కిరాయి దుకాణాలను దక్కించుకొని, కిరాయ, వేలం డబ్బులు చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి..
దేవాదాయ శాఖ అధికారి ఎక్కడ ?
దేవాదాయ శాఖకు చెందిన డిప్యూటీ కమిషనర్ హోదా అధికారి మాత్రమే కొండగట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారిక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ హోదా గల అధికారి, అదనపు బాధ్యతలతో ఆలయంకు కార్యనిర్వహణాధికారిగా కొనసాగారు. ఆ కాలంలోనే కోట్లాది రూపాయల బకాయలు ఎందుకు వసూలు చేయలేకపోయారు ? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ రికవరీ చట్టం ఉపయోగించి ఎందుకు వసూలు చేయలేకపోయారో అందుపట్టడం లేదు. ఇది ఇలా ఉండగా చెక్ పవర్ గల అధికారి, ఆయన పర్యవేక్షణలోనే ఆలయ ఆదాయం, ఖర్చులు. రికార్డులలో నమోదు చేస్తారు తప్ప, ఉద్యోగులు స్వతగా రికార్డులలో నమోదు చేసే అవకాశం లేదనే విషయం జగమెరిగిన సత్యం. దేవదాయ శాఖ అధికారి అయితే తమ సాధకబాదకాల తెలిసి ఉండేవని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం కార్య నిర్వహణ అధికారి రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారి గత నెల వరకు కొనసాగారు, భక్తుల సౌకర్యాల,పరిపాలన సౌలభ్యమా తెలియదు కానీ అర్ధాంతరంగా అధికారి బదిలీ చేసి దేవదాయ శాఖకు చెందిన అధికారి నియమించారు. వేములవాడ నుండి బదిలీ కాకుండా ఉండేందుకు ఆ అధికారి. స్థాయికి మించి, స్థాయికి తగ్గి ఎన్నియత్నాలు చేసిన బదిలీ వేట నుంచి తప్పించుకోలేకపోయింది.
నామినేషన్ పనుల కోసం ఒత్తిడి !


కొండగట్టు ఆలయం లో ప్రధాన ఉత్సవాల సందర్భంగా కొందరు ఆలయ అధికారులపై రాజకీయ ఒత్తిడి తెచ్చి టెండర్ ప్రక్రియ చేపట్టకుండా నామినేషన్ పై తన. అనుచరులకు, బినామీలకు ( చలువ పందిళ్లు ,వాటర్ సప్లై, లైటింగ్, తదితర ) పనులు కట్టబెట్టి కమిషన్లు పొందుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీఐపీలు, అధికార పార్టీ అగ్ర నేతలు, సెలబ్రిటీలు స్వామివారి దర్శనం కు వచ్చిన సందర్భంలో వీరి వీరాంగం, అతి ఉత్సాహంకు పట్టపగ్గాలు ఉండవు అనే విమర్శలు ఉన్నాయి. వీరు నేరుగా కార్యనిర్వహణాధికారితోనే చర్చలు , సమావేశలు పిచ్చపాటి బాతకానిలు, చేయడంతో ఈవో కార్యాలయానికి రాని సమయం, సందర్భంలో ఉద్యోగులు, సిబ్బంది, వారు చెప్పింది చేయాల్సిందే తప్ప, మరో మార్గం లేని దుస్థితి నెలకొంది. వీఐపీల సందర్శన సందర్భంగా వ్యక్తిగత సహాయకులకు, అంగరక్షకులకు, ముందస్తుగా వారికి బాలయ్య ఉద్యోగులు, సిబ్బంది,సకల సపర్యాలు చేయాల్సిన దుస్థితి వారికి తప్పడం లేదు.
లక్షలు పెట్టారు, వెయ్యి రూపాయలు ఇస్తారా…
ఆలయ ప్రాంగణంలో నూతన వాహన పూజ సందర్భంలో యజమాని, పూజా టిక్కట్టుతోపాటు, పూజలు నిర్వహించిన అర్చకుడికి కొంత మొత్తం దక్షిణ సమర్పించుకుంటే. మీరు లక్షల రూపాయలు పెట్టి వాహనం కొనుగోలు చేశారు. మాకు ఇంతేనా అంటూ పూజారులు భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి .

చెక్ పోస్ట్ ద్వారా వాహనాలు ఆలయం వరకు రాకపోకలకు సెక్యూరిటీ గార్డులు నిర్బంధంగా వాహనదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టెంకాయ కొట్టడం, సామాన్లు భద్రపయించడం, పూజా సామాగ్రి కొనుగోలు, వాటర్ బాటిల్లో, శీతల పానీయాలు ,తదితర అంశాల్లో అంజన్న భక్తులు విధిగా వాటికి అధిక డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి కొండపై నెలకొంది.
పాలకవర్గమే ప్రక్షాళన చేయాలి !
గత కొన్ని నెలల క్రితం ఏర్పడిన కొండగట్టు ఆలయ పాలకవర్గ సభ్యులు ఆంజనేయ స్వామి ఆదాయంను అడ్డుకుంటున్న వారిని, ఆలయంకు రావాల్సిన కోట్లాది రూపాయలు బకాయిల వసూలుకు శ్రీకారం చుట్టి అవినీతి, అక్రమాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం, బాధ్యత వారిదే. కనీసం 2017-18 నుంచి 2020-2021 వరకు రికార్డులు పరిశీలిస్తే ఏ అధికారి హాయంలో ఎంతో మొత్తం గోల్ మాల్ జరిగిందనే విషయం. వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చర్య ద్వారా రాష్ట్రంలోని ఇతర ఆలయాల పాలకవర్గలకు. కొండగట్టు ఆలయ పాలకవర్గం ఆదర్శంగా అగుపించాల్సిన అవసరం నెలకొంది.