(J.Surender Kumar)
ఉత్తర తెలంగాణ జిల్లాలలోని పుణ్యక్షేత్రాలలో భక్తజనంను మూడున్నర దశాబ్దాల కాలంగా, శ్రవణానంద పరుస్తున్న, భక్తి రసమైన పాట, రచయిత జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రానికి చెందిన శ్రీమతి పణతులు వరలక్ష్మి అనే విషయం బుధవారం వెలుగు చూసి.
వివరాల్లోకి వెళ్తే.
ధర్మపురి పుణ్యక్షేత్రానికి చెందిన పనతుల వరలక్ష్మి శంకర్,
దాదాపు 38 సంవత్సరాల క్రితం ఆమె కలం నుంచి జాలువారిన పాటల లో ఒకటి ” జయ జయలక్ష్మి వల్లభ.. జయ నారసింహ.. ” భక్తి పాట. నిత్యం స్థానిక లక్ష్మి స్వామి, ఇతర ఆలయాల్లో పలువురు గాయకుల కంఠ స్వరాల్లో, భజనలు భక్తి పాటలు పోటీలలో, సాహిత్య సంస్కృతి కార్యక్రమాలు ఆరంభంలో మారుమోగుతూనే ఉంటుంది.
ఈ పాట రచయిత గురించి నేటి వరకు భాహ్య ప్రపంచానికి తెలియదు. రచయిత పనతుల వరలక్ష్మి, కుటుంబ సభ్యులు ఒత్తిడితో వారి కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో, ” జయ జయలక్ష్మి వల్లభ జనారసింహ ” పాట సి డి కీ ప్రత్యేక పూజలు నిర్వహించి .

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు ఇందరపు రామయ్య, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, ఉత్తమ ఉపాధ్యాయ ( రాష్ట్రపతి అవార్డు గ్రహీత ) గుండి రాంకుమార్, పలువురు సి డి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు, ప్రముఖ గాయకుడు, ఘంటసాల అవార్డు గ్రహీత, గుండి శంకర్ శర్మ, పాడుతా.. తీయగా. ఈ టీవీ ఫేమ్ రావులపల్లి కుశాల్, ఈ సందర్భంగా చేసిన గానం పలువురు పరవశించిపోయారు. ప్రసిద్ధిగాంచిన ఈ పాట రచయిత పేరు, ఊరు ఈ కార్యక్రమంతో బయట ప్రపంచానికి తెలియడంతో ఔరా ఈ పాట రచయిత ఈమె నా అని ధర్మపురి వాసులు చర్చించుకుంటున్నారు