అశ్రు నయనాలతో జర్నలిస్ట్ రాము అంత్యక్రియలు

నర్సీపట్నంలో….


(J. Surender Kumar)
ఏపీయుడబ్ల్యూజే ,రాష్ట్ర ఉపాధ్యక్షులు , సీనియర్ జర్నలిస్ట్ , పసుపులేటి రాము అంత్యక్రియలు నర్సీపట్నం లో గురువారం అశ్రునయనాలతో ముగిశాయి.


40 సంవత్సరాల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ జర్నలిస్టుల సమస్యల పైన, పోరాటాలు చేస్తూ వారి పక్షాన నిలిచిన పసుపులేటి రాము అకాల మరణం పట్ల జర్నలిస్ట్ లోకమే, కాకుండా నర్సీపట్నం లోని ప్రముఖులు , వ్యాపారులు, పాత్రికేయులు , తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు .


నర్సీపట్నంలోని ఆయన స్వగృహం వద్ద మృతదేహానికి ఏపీయూడబ్ల్యూజే జెండాను కప్పి యూనియన్ జాతీయ నాయకులు డి. సోమసుందర్ , ఎం. శ్రీరామమూర్తి నివాళులర్పించారు.
ఐ.జే.యు. జాతీయ మహాసభలలో పాల్గొనేందుకు, చెన్నై బయలుదేరాల్సిన సమయంలో రాము కన్నుమూయడం బాధాకరమని డి. సోమసుందర్ , ,శ్రీరామ్మూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. రాము మరణం యూనియన్ కు తీరని లోటని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ కుటుంబ సభ్యులను ఓదార్చారు.


నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు , లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి , వార్త జి ఎం గ్రంధి రాజేశ్వరరావు , నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ జి ఆదిలక్ష్మి , కోనేటి రామకృష్ణ , దాడి బుజ్జి , న్యాయవాది శంకర్రావు , మైనార్టీ సంఖ్యల జాతుల రాష్ట్ర డైరెక్టర్ కోటి , ఎండి భాష , నర్సీపట్నం అధికారులు, జిల్లా నలుమూలల నుండి వచ్చిన పాత్రికేయులు నివాళులు అర్పించారు. ఏపీయుడబ్ల్యూజే జిల్లా నాయకులు సిహెచ్ఎల్బి స్వామి, నాగరాజు , రామకోటి , విజయ్ , వన రాజు , అప్పారావు , శేఖరు , వెంకట అప్పారావు , ఆచంట రామకృష్ణ , కోరాడచంద్రరావు, శ్రీనివాస్ కుమార్ , ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు , నివాళులు
ఏపీడబ్ల్యూజేఎఫ్ , రాష్ట్ర నాయకులు ఈశ్వరరావు , జాప్ నాయకులు రామకృష్ణ , వేణు తదితరులు బాధాతప్త హృదయంతో నివాళులర్పించారు.