బాలికల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిది

కలెక్టర్ రవి


(J. Surender Kumar)
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రవి ముఖ్య అతిథిగా పాల్గొని బాలికల హక్కులు కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా బాలికల హక్కులు కార్యక్రమానీ అధికారులు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాల్లో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే బాలికల నిష్పత్తి మెరుగ్గానే ఉన్నదని, అయినప్పటికీ కూడా పిల్లల హక్కులను వారు పూర్తిస్థాయిలో అనుభవించలేకపోతున్నారని, వారి హక్కులను, రక్షణ కాపాడవలసిన బాధ్యత అందరి పైన ఉన్నదని కలెక్టర్ పేర్కొన్నారు. ఆడపిల్లల యొక్క భవిష్యత్తును మాటల్లో కాకుండా, నిరంతరం అవగాహన, మానసిక, శారీరక వికాసం, పెంపొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని, లింగ సమానత్వాన్ని అమలు చేసినప్పుడే ఆడపిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని పేర్కొన్నారు

. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్
లతా .అరుణ శ్రీ సోషల్ వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్ బీసీ వెల్ఫేర్ అధికారి సాయి బాబా డిఎం &హెచ్ ఓ . శ్రీధర్ . డి . డబ్ల్యు ఓ .నరేష్ . వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు
అదనపు కలెక్టర్ తనిఖీలు !


మెట్ పల్లి మునిసిపాలిటీ వెంకటరావు పేట వార్డు నెం 4 లో శానిటేషన్, పనులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ మంగళవారం పరిశీలించారు డ్రైనేజీ వ్యవస్థ బాగా లేదని, నిర్మాణాలు చేయాలని ఆదేశించారు పని చేయని సిబ్బందికి చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్క్ పరిశీలించారు హైమస్ లైట్స్ మరియు మిగిలిన కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా చేయాలని పిల్లలకు ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇంటిగ్రేటెడ్ మార్కేట్ నిర్మాణం పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ,A E E శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగుల పాల్గొన్నారు

అడ్వర్టైజ్మెంట్!