భక్తజనంతో కిక్కిరిసిన దేవాలయం !

( J. Surender Kumar)
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది
.

ఉదయం నుండే అధిక సంఖ్యలో భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని అలాగే అనుబంధ దేవాలయములో గల శ్రీ స్వామివార్లను భక్తులు దర్శించుకున్నారు.


దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రధాన దేవాలయంలో గల అద్దాలమండపంలో లక్ష్మి పూజ కార్యక్రమాలు, లక్ష్మీసూక్తంతో ,

పురుషసూక్తంతో, అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు మాసశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలోరుద్రాభిషేకం, అష్టోత్తరంతో “మహలింగార్చన” పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది.


దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్ ,

అడ్వర్టైజ్మెంట్.

పండితులు శ్రీ పాలెపు ప్రవీణ్ శర్మ , ముత్యాల శర్మ అర్చకులు శ్రీ బొజ్జ రాజగోపాల్ శర్మ , ద్యావళ్ల విశ్వనాథ శర్మ , పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ , రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య , గునిశెట్టి రవీందర్ , గంధెపద్మ , ఇనగంటి రమ , సంగెంసురేష్ తదితరులు పాల్గొన్నారు.

అడ్వర్టైజ్మెంట్