ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
(J.Surender Kumar)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఊరురా బెల్ట్ షాపులతో గీత కార్మికుల ఉపాధికి గండి కొడుతుంది.. టిఆర్ఎస్ ఇచ్చిన హామీలు చర్చకు రాకుండా ఎన్నికలప్పుడు కొత్త పథకాలను తెరపైకి తేస్తోందని పట్టబద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎక్సైజ్ ఆదాయం ₹ 8 వేల కోట్లు ఉండగా, ప్రస్తుతం ₹26 వేల కోట్లకు పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయని అన్నారు. బెల్ట్ షాపులు నిర్వాహనతో గీత కార్మికుల ఉపాధికి గండి కొడుతున్న ప్రభుత్వానికి గీతాకార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని జీవన్ రెడ్డి అన్నారు.
బెల్ట్ షాపులు గ్రామాల్లో 24 గంటలు తెరిచి ఉండడంతో నిరుపేద వర్గాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు., మంత్రి కేటీఆర్ గీత కార్మికులకు గీత బందు అంటూ కొత్త చర్చ తెరపైకి తీసుకువస్తున్నారని, కల్లు గీత కార్మికుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఊరూరా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను మూసివేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కల్లు మండువ వద్ద పోలీసుల తనిఖీలు నిలిపివేయాలని అన్నారు.
కాంగ్రెస్ పాలనలోనే కుల వృత్తులకు భరోసా..
ఊరురా గీత కార్మికులు, మత్స్యకారుల సొసైటీలు ఏర్పాటు చేసి కులవృత్తులకు కాంగ్రెస్ భరోసా కల్పించిందని అన్నారు., కులవృతులపై ఆంక్షలు తొలగించిందని, పటిష్టమైన చట్టాలను రూపొందించిందని గుర్తు చేశారు. ఇల్లు లేని నిరుపేదల అందరికీ ఇల్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ దేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
బీసీ సబ్ ప్లాన్ ఏమైంది..?
2018 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని బీసీ ప్రజాప్రతినిధులతో రెండు రోజులపాటు సమావేశం నిర్వహించి సబ్ ప్లాన్ ఏర్పాటుకు సలహాలు, సూచనలు తీసుకున్నారు. బీసీలు ఆర్థికంగా, విద్యా పరంగా అభివృద్ధికోసం అవసరమైన చర్యలు చేపట్టేందుకు అవసరమైన నిధులు కేటాయింపు కోసం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు.

నాలుగేళ్లు గడుస్తున్న బీసీ సబ్ ప్లాన్ ఊసే లేదని విమర్శించారు., సీఎం కేసీఆర్ పాలనలో 15 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలా లేవని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో కుల సంఘాలకు భవన నిర్మాణాలు చేపడుతున్నామంటూ సీఎం కేసీఆర్ చెప్పుకుంటున్నారని, కుల సంఘాల భవన నిర్మాణాలను తాము స్వాగతిస్తున్నామని, వీటితోపాటు ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
నిరుపేద వర్గాల అందరికీ భీమా సౌకర్యం కల్పించాలి..
రైతులకు రైతు బీమా కల్పించామని చెప్పుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతు కూలీలకు సైతం భీమా సౌకర్యం కల్పించాలనీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పథకాల పేరిట కులాలను విడదీస్తున్నారని ఆరోపించారు. కుల మతాలకు అతీతంగా దారిడ్ర్యరేఖకు దిగువన ఉన్న అన్ని వర్గాల ప్రజలకు భీమా సౌకర్యం కల్పించాలని, సామాజిక న్యాయం పాటించాలని అన్నారు.
ఈ సమావేశంలో పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, గాజంగి నందయ్య, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, .జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ మధు, .మైనార్టీ సెల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మన్సూర్, .మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు నేహాల్, జగదీశ్వర్, .రాధా కిషన్ తదితరులు పాల్గొన్నారు.