భారతీయ సంతతికి చెందిన వాడు !
(J. Surender Kumar)
ఒకనాటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య దేశానికి, నేడు ప్రధానిగా మన భారతీయ సంతతికి చెందిన మొట్టమొదటి వ్యక్తి రిషి సునక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ , మూలాలు భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం జీరకరాత్ లో ఉన్నాయి.

కన్సర్వేటర్ పార్టీ సభ్యుడిగా 2015 నుంచి నార్త్ యార్క్ రిచ్మండ్ పార్లమెంట్ స్థానం నుంచి బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుడు. గత కొన్ని నెలల క్రితం అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక రాజకీయ, సంక్షోభ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ పదవి కోసం రిషి సునక్, లీజు ట్రస్ హోరా హోరీ పోటీపడ్డారు.

.రిషి స్వల్ప మెజార్టీతో ఓటమి పొందారు. బ్రిటిష్ ప్రధానిగా 45 రోజులపాటు పాలన కొనసాగించిన లీజు ట్రస్, ఆర్థిక పరిపాలన, పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, గాడిలో పెట్టలేక ఆమె చేతులెత్తి వేశారు. ఈనెల 20న ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు..

తిరిగి ప్రధాని పదవికి ఇదే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ మెనీ మార్తాండ్, రిషి పోటీ పడ్డారు. ప్రాథమికంగా కనీసం వంద మంది ఎంపీల మద్దతు కలిగి ఉంటేనే ప్రధాని పదవికిపోటీ చేసే అభ్యర్థికి అర్హత ఉంటుంది. ఆ సంఖ్యా బలం లేకపోవడంతో పోటీ నుంచి మార్తాండ్ తప్పుకున్నాడు. దీంతో రీషి సునక్ 180 M.P మద్దతు పలికారు, ప్రధానిగా ఏకగ్రీవం కావడంతో రిషి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ట్విట్టర్ ద్వారా రిషికి అభినందనలు తెలిపారు.

1980 మే 12న జన్మించిన రిషి ,తల్లిదండ్రులు ఎస్వీర్ సునాక్, తల్లి ఉష వీరిద్దరూ ఫార్మసిస్టులు. 1960లో తూర్పు ఆఫ్రికా నుండి U.K కు వలస వెళ్లారు. తండ్రి నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టీషనర్ గా, తల్లి ఉష కెమిస్ట్ గా మెడికల్ షాప్ నిర్వహించేది. ఇన్ఫోసిస్ అధినేత నారాయణ సుధా మూర్తి దంపతుల, కూతురు అక్షితమూర్తిని, రిషీ సునక్ .2009 లో. పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు, కృష్ణ సునక్, అనుష్క సునక్, కేవలం రిషి సునక్ కు 700 మిలియన్ పౌండ్ల ఆస్తులు ఉన్నాయి.