(J. Surender Kumar)
బి.ఆర్.ఎస్ పార్టీతో దేశంలో నవశఖానికి నాంది పలికినట్లయిందని ఎస్సీ అభివృద్ధి మరియు మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు,
తద్వారా దేశానికి సరికొత్త ఎజెండానందించి దిశా నిర్దేశం చెయ్యొచ్చు అన్నారు. నవశఖానికి నాంది పలకటానికి బీఆర్ఎస్ ఏర్పాటైందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు.

మంత్రి మాట్లాడుతూ..
👉ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన పార్టీలు అభివృద్ధి లో విఫలం అయ్యాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు.
👉దేశానికే తెలంగాణ రాష్ట్రం మోడల్ గా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ఎవరికీ అంతుపట్టని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. నాడు విమర్శలు చేసిన వారికి రాష్ట్రం సాధించి చెంపచెల్లుమనిపించారని చెప్పారు.
👉దేశంలో అనిశ్చితి నెలకొందని, ఇలాంటి పరిస్థితి నుంచి అధిగమించదానికి జాతీయ స్థాయిలో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. తెలంగాణ లో అమలు చేస్తున్న పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
👉సీఎం కేసీఆర్ తిసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో సంచలన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారటం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
దేశాన్ని విచ్ఛిన్నం చేయటమే లక్ష్యంగా బీజేపి వ్యవహరిస్తోందన్నారు.

👉ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మబోతొందన్నారు, విద్యుత్ రంగ సంస్థలను ప్రయివేటికరణ కు యత్నిస్తోందని ఆరోపించారు,ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ఆవిష్కృతం అయ్యిందన్నారు, రైతుబంధు,దళిత బంధు కేంద్రం ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.
సమావేశంలోజగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి యం.పి.పి చిట్టి బాబు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం – మంత్రి కొప్పుల

శుక్రవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చర్లపల్లి గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తెరాస పార్టీ జెండా ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, గ్రామంలో 84 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అనంతరం గ్రామంలో మంజూరు అయిన 14 మంది కళ్యాణ లక్ష్మీ – షాదీముబారక్ లబ్దిదారులకు రూ. 14,01,624 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.

వివిధ కారణాల వల్ల అనారోగ్యం పాలైన టువంటి వాళ్ళు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్నటువంటి 94 మంది లబ్ధిదారులకు 30,03,000 విలువ గల చెక్కుల పంపిణీ . చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….
👉కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది.
నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారు.

👉టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.
👉మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.