ప్రమాదానికి రోడ్డుపై గుంతలే కారణమా?
అధికారుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణాలు బలి.
(Surender Kumar )
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

దేవునూరి శ్రీకాంత్ అనే వ్యక్తి హుజురాబాద్ నుంచి ఫ్యామిలీతో కలిసి AP09CB 4635 ,షిఫ్ట్ డిజైర్ కారులో కోటిలింగాల, గోదావరికి నదికి వెళ్తున్న క్రమంలో కిషన్ రావు పెట్ దగ్గర ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు..

ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారి స్వస్థలం మందమర్రి కాగా, వారు ధర్మపురి లో నివాసం ఉంటున్నారు. బొడ్డు సుజాత.(45) ఆమె కూతురు బొడ్డు ప్రిన్సిత (16) ధర్మపురికి చెందిన మిల్కరణీ (17) మృతి చెందగా ఈమె తండ్రి ఆటో డ్రైవర్ ప్రభాకర్, కోటిలింగాల గ్రామానికి చెందిన మంచికట్ల పుష్ప కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిద్దరిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. డెడ్ బాడీలను పోలీసులు జగిత్యాల మార్చురీకి తరలించారు.

అయితే వీరంతా ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం రాజారాంపల్లి లోని చర్చి కి ధర్మపురి నుండి రాజారాంపల్లి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. .ఓకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ధర్మపురిలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

మృతుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. . ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం, రోడ్డుపై గుంతలు మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం ముందస్తు ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డు లు ఏర్పాటు చేయకపోవడంతో, వాహన దారుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి అనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి.

గతంలోనూ ఈ రోడ్డుపై గుంతల వల్ల 10 మంది మృతి చెందారు. ఏడాది క్రితం పాసిగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. నెలరోజుల క్రితం స్థంభం పెళ్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంతలు తప్పించబోయి ఇద్దరు యువకులు , టిప్పర్ ఢీకొని మృతి చెందారు. ఈ రోడ్డులో గుంతల కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులలో చలనం లేదు అనే ఆరోపణలు విమర్శలు