డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళం కాదు
మంత్రి కొప్పుల !

(J. Surender Kumar)
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. TRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చండూరు మండలం బోడంగిపర్తిలో ప్రచారములో పాల్గొన్న
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళం కాదు
ప్రజల మద్దతుతో గెలిచామని ,మళ్ళీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ బిజెపి, కాంగ్రెస్ పార్టీ లు ఓట్లు కొనచ్చని అనుకుంటున్నాయి, ఈ ఎన్నికలో అలాంటి వారిని ప్రజలు నమ్మరన్నారు


బీజేపీ అంటేనే ఎస్సీ, బిసి వర్గాల వ్యతిరేక పార్టీ, బీజేపీ పాలనలో దళితుల పై దాడులు పెరిగాయని మంత్రి గుర్తు చేశారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు గత పాలకులు ఫ్లోరైడ్ తో బాధపడుతున్న నల్గొండ జిల్లాను పట్టించుకోలేదన్నారు.

ADVERTISEMENT


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన వెంటనే, ఫ్లోరైడ్ రహిత నీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మిషిన భగీరథ అమలు చేసి, మంచి నీటిని అందించారు, ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయో ప్రజలకు పూర్తిగా అర్థం అయింది, అందుకే రాజా గోపాల్ రెడ్డి, ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో, ఎవరి కోసం రాజీనామా చేశారని ప్రజలు నిలదీయాలి అన్నారు..
18 వేల కోట్లు ప్రజలకు పంచి ఇస్తాడా, ఒక్క ఓటు కూడా రాజగోపాల్ రెడ్డి కి వేయవద్దని మంత్రి అన్నారు….


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో పేదలు ముఖ్యంగా దళిత వర్గాల, విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు

ఈ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి, .కేసీఆర్ కు బహుమతిని ఇద్దామని మంత్రి అన్నారు..