దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు లో


పాల్గొన్న స్పెషల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్


( J. Surender Kumar )
జగిత్యాల జిల్లా యందు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్సీ డెవలప్మెంట్ స్పెషల్ సెక్రటరీ టి విజయ్ కుమార్ ఐఏఎస్ హాజరై, పశుసంవర్ధక శాఖ హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టి నిర్వహించబడుచున్న కార్యక్రమలను తెలుసుకొని జగిత్యాల జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాలకు మంచి అవకాశం ఉన్నందున ఈ జిల్లా యందు పశువుల సంఖ్య కనుగుణంగా పాల దిగుబడిని సాధించుటకు దళిత బంధు లబ్ధిదారులు గడ్డి పెంపకం కేంద్రములను ఏర్పాటు చేసుకొనుటకు అదే విధంగా శైలేజ్ హిట్స్ ఆక్వా కల్చర్ మరియు సమీకృత పౌల్ట్రీ హార్టికల్చర్ కింద ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయుటకు తెలిపినారు.


జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆదేశం అనుసరించి మంజూరు చేయబడిన 345 మంది లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్ విషయంలో ప్రభుత్వ ఆదేశాల క్రమము ప్రత్యేకంగా తీసుకున్న చర్యలను పిపిటి ద్వారా వివరించారు.

అలాగే లబ్ధిదారుల విజయ గాథలను వివరించారు . తదుపరి ఆక్వా కల్చర్ పాల ద్వారా వచ్చే ఉపవస్తువులైన పన్నీరు, నెయ్యిల పై దృష్టి పెట్టి అధిక ఆదాయాలను సంపాదించాలని తెలిపారు. అన్ని శాఖల ద్వారా సమావేశంలో వచ్చిన నూతన ప్రతిపాదనలను కూలంకషంగా చర్చించి రెండవ విడత ఎంపిక కాపాడు లబ్ధిదారులకు తెలియజేయునట్లు ప్రణాళిక రూపొందించుటకు సూచించి ఉన్నారు


లక్ష్మారెడ్డి దళిత బంధు సలహాదారు మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ అధికారులు ఆక్వా కల్చర్ నందు ఉన్న అపార అవకాశములను ఇంటెగ్రేటెడ్ పౌల్ట్రీ యందు వచ్చు లాభాల గురించి వివరించినారు
డిక్కీ ప్రతినిధులు మరియు సర్ఫ్ అధికారులు వివిధ పథకముల గురించి లబ్ధిదారుకు ఉండవలసిన లక్షణాలు మెలకువలు గురించి వివరించారు
ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ఈ డి ఎస్ సి కార్పొరేషన్ నరేష్ బి డబ్ల్యు డి వి హెచ్ ఓ ఎల్డీఎం హార్టికల్చర్ అధికారి డిఎస్సి డివో అన్ని శాఖల అధికారులు దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు

జూనియర్ అసిస్టెంట్ల శిక్షణ !


ఇటీవల మునిసిపల్ డిపార్ట్మెంట్ విధులలో చేరిన జూనియర్ అసిస్టెంట్లు (గ్రామ రెవెన్యు అధికారులు) తెలంగాణ మునిసిపాలిటి చట్టం-2019 ను అవగాహన చేసుకొని తదనుగునముగా విధులు నిర్వహించాలని, ఇట్టి శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాలు తమ తమ రోజు వారి విధులలో ఉపయోగపడగలవని తెలిపారు జిల్లా కలెక్టర్ రవి, అడిషనల్ కలెక్టర్ జె. అరుణశ్రీ . శిక్షణ విధి విధానాలు తదితర అంశాలను జూనియర్ అసిస్టెంట్ వివరించారు.
కలెక్టర్ ను కలిసిన ఫార్మసీ కౌన్సిల్ చైర్మెన్ !


జగిత్యాల కు చెందిన డా.ఆకుల సంజయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ జి.రవి గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలిసి పుష్పగుఛ్చమందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ లో సభ్యుడైన డా.సంజయ్ రెడ్డి ఫార్మసీ కౌన్సిల్ చైర్మెన్ గా నియామకం అవడం పట్ల ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రవి అభినందించారు. ఫార్మసీ కౌన్సిల్ గురించి ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ ఉన్నారు.
వసతి భవనం పరిశీలన !


జగిత్యాల మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల సౌకర్యార్థం తాత్కాలిక వసతి కి ఈ భవనం
అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి అన్నారు.
వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న తాత్కాలిక హాస్టల్లో జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
సాధ్యమైనంత త్వరగా ఈ భవనంలో వైద్య విద్యార్ధులు ఉండేలా ఈ తాత్కాలిక హాస్టల్ కు మరమ్మతులు చేపట్టాలని సూచించారు