దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలి

MRPS జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్


(J Surender Kumar)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని. జగిత్యాల జిల్లా అధ్యక్షులు నరేష్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జిల్లా కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ టీ యస్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు..దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్నితొలగించాలని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం తీసుకువచ్చినటువంటి విప్లవత్మకమైన దళిత బంధు పథకం అమలు లోఎమ్మెల్యే ప్రమేయం ఉండటం వల్ల నిజమైన లబ్ధిదారులకు అందట్లేదని అన్నారు. దళితబంధు పథకం, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేవాళ్లకే దక్కుతుందనీ ఆవేదన చెందారు, ఏ పథకమేనా నిరుపేదలైన ఇల్లు లేని, భూమి లేని పేదవారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. జనాభా దమాషా ప్రకారం అత్యధికంగా జనాభా ఉన్నటువంటి మాదిగలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు, దళితబంధు పథకానికి మేము వ్యతిరేకం కాదని తెలిపారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి అమలు చేసే విధంగా క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ ద్వారా నిజమైన లబ్ధిదారులు గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు., జాతీయ,రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు. ఈ నెల 28 వ తేదీన దళితబంధు పథకం అమలులో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని లక్ష మందితో ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు.,.దళితబంధు అమలులో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా.ఆదేశాలు జారి చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులకు అప్పగించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున టీ ఎస్ ఎమ్మార్పీఎస్ దాని అనుబంధ సంఘాల కార్యాచరణ కొనసాగుతుందని చెప్పారు.,
ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి లక్ష్మణ్, బిసి సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు, జిల్లా కార్యదర్శి చొప్పదండి రాములు, జగిత్యాల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మెడ పట్ల చంద్రయ్య, కోడిమ్యల మండల అధ్యక్షులు దుబ్బాక వరుణ్, ఎం ఎస్ ఎఫ్ ఇంఛార్జి .మోతే రాకేష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మేడపట్ల లక్ష్మణ్, .చిలుముల గంగారాజం , మారంపెళ్ళి బాబు, అరికిల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు