ధర్మపురి కిడ్నాప్ సభ్యుల ముఠా అరెస్ట్!

C.I. కోటేశ్వర్ !


( J. Surender Kumar )
పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో కలకలం సృష్టించిన. ఐదుగురు
కిడ్నాప్ సభ్యుల ముఠాను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ పంపినట్టు ధర్మపురి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తెలిపారు.

కారు, రెండు ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు, కత్తి ఇనుప రాడులు, వైరు, ప్లాస్టర్, గ్లౌజులు, మరికొన్ని వస్తువులు వారి వద్ద నుండి స్వాధీన పరుచుకున్నట్టు ఆయన వివరించారు.


బుధవారం రాత్రి ధర్మపురి పోలీస్ స్టేషన్లో సీఐ కోటేశ్వర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించి, నిందితులను ప్రవేశపెట్టారు. సంఘటన జరిగిన తీరు, వివరాలను వివరించారు.
సీఐ కోటేశ్వర్ వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్వాధీన పరుచుకున్న ద్విచక్ర వాహనాలు కారు


పట్టణానికి చెందిన పంబాల యుగంధర్, సంఘీ నరేష్ ల మధ్య పెట్రోల్ పంపు వ్యాపార లావాదేవీల వివాదం గత కొంతకాలంగా కొనసాగుతుందని వివరించారు, సంఘీ నరేష్ వద్ద రావలసిన డబ్బులు కోసం, యుగంధర్, నరేష్ ల మధ్య . అనేకసార్లు గొడవలు, పంచాయతీలు జరిగాయన్నారు.
సంఘీ నరేష్ వద్ద డబ్బులు వసూలు కోసం యుగంధర్ పథకం రచించాడని అన్నారు.. పెండ్యాల అశ్విని కుమార్ పూజల వల్ల తన వ్యాపారం మంచిగా జరుగుతున్నదని, ఆయన ద్వారా పూజలు కోసం ఈ నెల 17న నరేష్ అతని వద్దకు వెళ్లాడని వివరించారు. ముందుగా యుగంధర్ రచించిన పథకం ప్రకారం,. సమాచారం రావడంతో యుగంధర్, నరేష్ ను కిడ్నాప్ చేసి తన డబ్బులు వసూలు కోసం తన మిత్రులైన తుమ్మ ఉపేందర్, పులిసెట్టి శ్రావణ్, ఎస్.కె అస్లాం, పెండ్యాల అశ్విన్ ల. సహకారం కోరినట్టు సీఐ వివరించారు. ఈ మేరకు నరేష్ పూజలో కూర్చొని ఉండగా వెనకవైపు నుండి దాడి చేసి నరేష్, కాళ్లు చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి కిడ్నాప్ చేసిన ముగ్గురు యుగంధర్ ఇంటిలో నరేష్ ను. బంధించి తనకు రావలసిన డబ్బుల కోసం డిమాండ్ చేశారని, సాయంత్రం నరేష్ ను కారులో తీసుకొని డబ్బుల కోసం హతమార్చడం కై ప్రయత్నించినట్టు సిఐ తెలిపారు. కోసునూరు పల్లి గ్రామ పరిసరాలలో కొందరు కారును అడ్డుకోవడంతో నరేష్ ను వదిలి వారు పారిపోయారని, సిఐ కోటేశ్వర్ వివరించారు. బుధవారం సాయంత్రం రాయపట్నం గోదావరి బ్రిడ్జి వద్ద ఐదుగురు నిందితులు డబ్బుల విషయంలో చర్చిస్తు హైదరాబాద్ కు పారిపోయే యత్నంలో ఉండగా, మెరుపు దాడి చేసి వారిని అదుపులో తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్నట్టు సిఐ కోటేశ్వర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై కిరణ్, పోలీసులు పాల్గొన్నారు . వీరిపై. క్రైమ్ నెంబర్ 304/2022 నమోదు చేసి, 364-A,307, 506, 120-B r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.