ధర్మపురి లో ఘనంగా దీపావళి వేడుకలు!

( J. Surender Kumar )


ధర్మపురి క్షేత్రంలో సోమవారం ఘనంగా దీపావళి వేడుకలను ప్రజల ఆనందోత్సవాలతో జరుపుకున్నారు.


స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏర్పాటుచేసిన ప్రమిదల దీపాలంకరణతో ఆలయ ప్రాంగణం మరింత శోభాలంకరణ అందిపుచ్చుకుంది.
పట్టణంలో

పలువురు తమ ఇండ్ల ముందు దీపాలు వెలిగించి, బాణాసంచాను కాల్చారు.

మట్టి ప్రమిదల కొనుగోలుకు ప్రజలు ఆసక్తిని కనబరచారు.


ఉత్తమ సామాజిక సేవకుడిగా అబ్దుల్ రషీద్.


కోరుట్ల సామాజిక సేవాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ధర్మపురికి చెందిన అబ్దుల్ రషీద్ కు ఉత్తమ సామాజిక సేవకుడీ గా అవార్డ్ ఇచ్చి ఘనంగా సన్మానించారు.
ఎలాంటి సమయంలో అయిన రక్తం ప్లాస్మా ప్లేట్ లెట్స్ అవసరం ఉన్న వెంటనే రెస్పాండ్ అయి AB పాజిటివ్ కేసు అయితే ఇవ్వడంలో ఎల్లప్పుడూ ముందుంటాడు.
తన మిత్రుల ద్వారా ఇప్పిస్తుంటారు. 28కి పైనే రక్తదానం చేశారు..
కోరుట్ల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ . నిర్వాహకులు బాబుఝాన్ ,మంజూర్, ముస్తక్ మున్ను, ఉదయ్ నేత, ధర్మపురి మైనార్టీ సభ్యులు తదితరులు రషీద్ ను అభినందించారు.