ఫ్లాష్ .ఫ్లాష్. ఫ్లాష్
ధర్మపురిలో కిడ్నాప్ కలకలం ?

(J.Surender Kumar)
ధర్మపురి పట్టణంలో సోమవారం పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని కిడ్నాప్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

అయితే యువకుడి బంధువులు అతని కోసం గాలింపులు ముమ్మరం చేసి రాత్రి యువకుడి ఆచూకీ గుర్తించినట్టు సమాచారం. కిడ్నాప్ కాబడిన యువకుడిని..ఓ వాహనంలో అటవీ ప్రాంతానికి తరలిస్తుండగా యువకుడు బంధువులు వెంటాడి పట్టుకున్నట్టు సమాచారం. సోమవారం రాత్రి కిడ్నాపర్ అతని అనుచరులను పోలీసులకు అప్పగించినట్టు చర్చ.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.