ఫ్లాష్.ఫ్లాష్. కొండగట్టు అంజన్నకు, (పార్ట్-2)

ఒకే రోజున లక్ష రూపాయల డీజిల్ కొనుగోలు!
ఆదాయం హారతి కర్పూరంలా?


( J. Surender Kumar )
కొండగట్టు ఆలయంలో జనరేటర్ వినియోగం కోసం ఒకే రోజున  ₹ 1,29,116/- రూపాయల. డిజిల్ కొనుగోలు చేసినట్టు రికార్డులలో నమోదు చేశారు. కోట్లాది రూపాయల కొండగట్టు ఆదాయం హారతి కర్పూరంలా అంతరించిపోతున్న, అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారనే భక్తుల ఆరోపణలకు  ఈ అంశం నిదర్శనం.


కనురెప్ప పాటు  కరెంటుపోని  రాష్ట్రంలో…
ఆలయ జనరేటర్ కు డీజిల్ కొనుగోలు కోసం  2018 – 19 సంవత్సరంలో, ₹ 4,58,286/- ఓచర్ల ద్వారా డబ్బులు డ్రా చేస్తూ డీజిల్ కొనుగోలు చేసినట్టు రికార్డులలో పేర్కొనబడింది . ఇందులో ప్రత్యేకంగా  ఒకే రోజున ఓచేర్ నెంబర్,77/-  6-05-2018 .తేదీన, ₹ 27,840/- ఓచర్ నంబర్, 96/- 6-05-2018  తేదీన, ₹ 81,040/-  ఓచెర్  నంబర్, 94/- 6-05-2018  తేదీన, ₹ 20,236/- మొత్తం  ₹ 1,29,116/. రూపాయలతో డీజిల్ కొనుగోలు చేసినట్టు పేర్కొనబడింది.  మరోసారి ఒకే రోజున తేదీన  8-07-2018 నాలుగు ఓచర్ల ద్వారా, ఓచర్ నెంబర్, 353 ద్వారా,  ₹ 4000/-  ఓచర్ నెంబర్, 354, ద్వారా,  ₹ 13,810/-  ఓచర్ నెంబర్, 335 ద్వారా  ₹ 4,350/-  ఓచర్ నెంబర్, 357 ద్వారా ₹ 20,604/- మొత్తం ₹ 42,764/- రూపాయల డీజిల్ కొనుగోలు చేయగా, సాలిన మొత్తం ₹ 4,58,286/- డీజిల్ కోసం ఖర్చు చేసినట్టు రికార్డులో ఉంది.  రెప్పపాటు కరెంటుపోనీ తెలంగాణ రాష్ట్రంలో, జనరేటర్ వినియోగం కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయడం ఆలయ ప్రత్యేకత గా చెప్పుకోవచ్చు.


మరికొన్ని మాత్రమే….
ఆలయ ఆదాయం లెక్కింపు సందర్భంగా, ఏర్పాట్లు కోసం ఆలయ సిబ్బంది తేదీ, 23-04-2018 న హుండీ లెక్కింపు  కోసం  ఓచర్ నెంబర్ 50, ద్వారా ₹,10,000/-  హనుమాన్ జయంతి ఏర్పాట్లు కోసం తేదీ, 2-05-2018, ఓచర్ నెంబర్ 68,  ద్వారా  ₹ 75,000/-  డీజిల్ కొనుగోలు నిమిత్తం తేదీ  29-06-2018  ఓచర్ నెంబర్ 322, ద్వారా ₹ 20,000/-  తేదీ, 4-08-2018, ఓచర్ నెంబర్ 420,  ద్వారా ₹ 30,000/- తోటలో పర్యవేక్షణ, మొక్కలు నాటడం కోసం. తేదీ, 4-09-2018  ఓచర్ నెంబర్ 472, ద్వారా హుండీ లెక్కింపు ఏర్పాట్ల కోసం ₹ 30,150/-  తేదీ, 30-11-2018, ఓచర్ నెంబర్ 631 ద్వారా, 30Hp మోటార్ మరమ్మత్తుల కోసం ₹ 40,000/-  (తేదీ 4-3-2019, 13-3-2019. ఓచర్ నెంబర్ 755, ఓచర్ నెంబర్764, ద్వారా ₹ 50,000/- ₹ 1,50,000/ ) పవిత్రోత్సవం ఏర్పాట్ల కోసం ఆలయ సిబ్బందికి చెల్లించినట్టు రికార్డులో నమోదయింది. ఇట్టి కార్యక్రమాలకు వ్యయం చేసినట్లు రికార్డులలో పేర్కొన్న, వాటికి సంబంధించిన (ఖర్చుకు ) ఆమోదయోగ్యమైన పత్రాలు (రసీదులు) లేకపోవడం విశేషం.

పశు పోషణ  కోసం పేరిట,  ₹, 5, 17, 830/-
గోకులం ఎక్కడుందో ?


2018-19 సంవత్సరంలో జనరల్ ఫండ్ నుంచి  ₹ 2,10,480 /- . 2019-20 లో. ₹ 1,87, 000/-   2021-21 లో  ₹ 1,20,350/- డ్రా చేసి, పశు పోషణ నిమిత్తం నిర్వాహకులకు మొత్తం ₹ 5,17,830/- చెల్లించినట్లు రికార్డులలో నమోదు చేశారు. .గోకులం ఎక్కడ ఉందో ? దాని నిర్వహణ బాధ్యతలు ఎవరు చేపడుతున్నారో ? గోకులంలో ఆవులు ఎన్ని ఉన్నాయి ?   కోడెలు ఎన్ని ఉన్నాయి ? .వాటికి ఎలాంటి పోషణ, పర్యవేక్షణలు నిర్వహిస్తున్నారు ?  గోకులం వలన  ఆలయానికి వస్తున్న ఆదాయం ఎంత ?  తదితర వివరాలు అధికారులు ఆలయ రికార్డులలో నమోదు చేయనట్టు సమాచారం.
సత్యనారాయణ స్వామి వ్రత, ఆదాయంలో ₹.4, 400/-. గల్లంతు ?


2018-19 సంవత్సరంలో సత్యనారాయణ స్వామి వ్రతం రోజు వారి రిజిస్టర్ రసీదులలో  రసీదు నెంబర్, 9698 నుంచి 9745 ద్వారా, వసూలు కాబడిన మొత్తం  ₹ 9,800/-  డి సి ఆర్ ( డైలీ కలెక్షన్ రిజిస్టర్) కాగా  1-12-2018 న, జమ చేసిన మొత్తం ₹ 5,400/-  మిగిలిన  ₹ 4,400/- డబ్బులు గల్లంతు అయినట్టు సమాచారం. .ఈ డబ్బులు ఎవరి వద్ద ఉన్నాయో ?  తెలియడం లేదు.  దీనికి తోడు 2018-19 లో నిత్య అన్నదానం, రోజువారి వసూలు రికార్డులలో  భక్తులు చెల్లించిన రసీదులలో  ₹ 22,232/- నమోదయి ఉన్న, నిత్య అన్నదాన పథక నిధులకు, ఈ మొత్తం జమ చేయనట్టు సమాచారం . ఇది ఇలా ఉండగా 3-1-2019  హుండీ లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయం ₹ 37,22,936/-  హుండీ ఆదాయము నమోదు రికార్డులలో ₹ 37,21,936/-  నమోదు చేశారు. .మరో ₹ 1000/- రికార్డులలో నమోదు కానట్టు సమాచారం.

మామిడి తోటల ద్వారా ఆదాయం ఎంత ?

కొండగట్టు ఆంజనేయ స్వామికి చెందిన, సర్వేనెంబర్  260, 410,  లలో మామిడి తోటలు  ఉన్నాయి. .వీటి మామిడి కాయల వేలం  ద్వారా స్వామివారికి ఆదాయ కల్పన  కోసం ప్రతి సంవత్సరం వేలం నిర్వహిస్తారు.  2018-19, 2019-20,  2020-21 .సంవత్సరలలో వేలం నిర్వహించారా ?  లేదా అనే విషయంలో స్పష్టత లేదు ?  నామినేషన్ పద్ధతిలో ఇచ్చారా ?  ఎంత మొత్తం కు ఇచ్చారు ?  అనే సమాచారం లేదు ?  ఆంజనేయ స్వామికి  ఆదాయం వచ్చిందా? .రాలేదా? .అనే విషయం లో ఆలయ రికార్డులలో క్లారిటీ లేదు.

ఉద్యోగికి అడ్వాన్స్ వేతనం ₹ 2,00000/-

కొండగట్టు ఆలయ ఉద్యోగి ఒకరు  21-9-2014  నుండి 26-6-2015. వరకు విధులలో లేనట్టు సమాచారం.  ఈ కాలంలో ఉద్యోగికి చెల్లించాల్సిన వేతనం ₹ 4,11,883/- కాగా తేదీ 30-3-2021 న ఓచర్ నెంబర్ 446, ద్వారా.         ₹ 2, 00000/- అడ్వాన్సుగా చెల్లించినట్లు రికార్డులు నమోదయింది.  దాదాపు 7, 8  నెలలుగా ఈ ఉద్యోగి ఎక్కడ విధులు నిర్వహించారు ?  ఆ కాలానికి వేతనం ఎందుకు చెల్లించలేదు ?  సెలవులో ఉన్నాడా?  అనారోగ్యంతో ఉన్నాడా?  తదితర వివరాలు రికార్డులలో నమోదు చేయకుండా అడ్వాన్సుగా ఆ ఉద్యోగికి రెండు లక్షల రూపాయలు చెల్లించడంలో ఆంతర్యం  ఏమిటో. అధికారులే వివరించాల్సి ఉంటుంది.