₹ 21 కోట్ల నిధుల ఖర్చుకు లేక్క, పత్రం లేదా ?
కోట్లాది రూపాయల గోల్ మాల్ వెనక ఎవరు ?
( J. Surender Kumar )
” శని, గ్రహచార, దోష నివారణ, ఉపశమనం కోసం, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో తమకు ఉపశమనం కలుగుతుంది, అని అనాదిగా భక్తుల విశ్వాసం, ఎనలేని నమ్మకం. ఇలాంటి మహిమాత్మ గల శ్రీ ఆంజనేయ స్వామి, ఆలయ ఆదాయ నిధులకు అవినీతి చెదలు పట్టింది ? కోట్లాది రూపాయల నిధుల గోల్ మాల్ వెనుక ఎవరున్నారు. ? దాదాపు ₹ 21 కోట్ల ఆదాయ నిధుల ఖర్చు కు, లెక్క, పత్రం లేదా ? అనే చర్చ భక్తజనంలో నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి, మొక్కులు తీర్చుకొని, ముడుపులు కట్టడానికి, సాలిన లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. .ప్రత్యేకంగా పేదల ప్రత్యక్ష దైవంగా, గ్రామీణులు తరలి వస్తుంటారు. వీరితోపాటు వీఐపీలు, సెలబ్రిటీలు సైతం అంజన్న ను దర్శించుకుంటారు. దీంతో ఆలయానికి సాలిన కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నది.
కోట్లాది రూపాయల ఆదాయంను, ఆలయ అధికారుల అర్చకులు, సిబ్బంది, జీతభత్యాలు, భక్తుల సౌకర్యాల కల్పన, నిర్వహణ తదితర వాటికోసం ఆలయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో, ఖర్చు చేస్తారు.

ఆలయ అధికారుల పర్యవేక్షణలో జరిగే కోట్లాది రూపాయల నిధుల, ఖర్చులకు సంబంధించి కొన్ని కోట్లా రూపాయల పద్ధులకు, సంబంధించిన లెక్కలకు ఆమోదయోగ్యమైన, పత్రాలు లేనట్టు సమాచారం.
వివరాలు !
2007 – 2008 సంవత్సరం నుంచి 2020- 2021 వరకు ₹ 21 కోట్ల, 80 లక్షల, 76 వేల 137/- రూపాయల ఖర్చుకు సంబంధించి ఆమోదయోగ్యమైన పత్రాలు లేనట్టు రికార్డులలో నమోదు అయ్యింది.
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ.
2015 -16 లో ₹ 4,69,46,387/- 2016-17 లో ₹ 37,39,041/- . 2017-18 లో ₹ 46,83,975/- 2018-19 లో ₹ 59,18,469/-. 2019 -20 లో ₹ 6,49,65,118/- 2020 -21 లో ₹ 15,35,173/- దాదాపు ₹ 12 కోట్ల, 77 లక్షలు, 88 వేల 163/- నిధులు ఖర్చుకు ఆమోదయో యోగ్యమైన పత్రాల వివరాలు లేనట్టు సమాచారం.
ఉమ్మడి రాష్ట్రంలో.
2007-08 లో ₹ 6,55,193/- 2008-09 లో ₹ 70,29,231/- 2010-11 లో ₹ 1,83, 92,911/- 2011-12 లో ₹ 4,11,27,680/- 2012-13 లో ₹ 32,84,032/- 2013-14 లో ₹ 53,96,384/- 2014-15 లో ₹ 1, 44, 02, 543/- దాదా దాదాపు ₹, 9 కోట్ల 28 లక్షల 3 వేల 674/-. నిధుల. ఖర్చు కు ఆమోదయోగ్యమైన పత్రాలు లేనట్టు తెలిసింది.
ఆలయానికి చెందాల్సిన ₹ 5, 078,8,952/- వేలం పాట దారుల వద్దనే !

2019 మార్చి మాసం నుంచి, 2021 మార్చి మాసం వరకు కొండగట్టు అంజన్న స్వామి ఖాతాలో జమ కావలసిన ఆదాయ సొమ్ము ₹. 5, 078, 8,952/- ఖాతాలో నమోదు కానట్టు సమాచారం. ఆలయ అధికారుల నిర్వహణలో నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి తో, కోట్లాది రూపాయల వేలం పాట దారిలో వద్దనే ఉన్నట్లు సమాచారం.
ఆదాయం ఎలా సమకూరిందంటే !
అంజన్న ఆలయ ప్రాంగణంలో, వివిధ రకాల వ్యాపారాల, వేలం పాటలో అధిక వేలం పాటకు దక్కించుకున్న వ్యాపారుల నుండి రావలసిన సొమ్ము ఇది. నిబంధనల మేరకు వేలం పాటలో దక్కించుకొని వ్యాపారం నిర్వహించేవారు. వారం రోజులలో డిపాజిట్ సొమ్ము కలుపుకొని ₹ 75% సొమ్మును చెల్లించి, ₹ 25% సొమ్ముకు బ్యాంకు షూరిటీతో, పాటు ఆలయానికి పోస్ట్ డేటెడ్ , చెక్కులు ఇవ్వాలి. ఒకవేళ బ్యాంకు షూరిటీ ఇవ్వక పోతే, వేలంలో పాడిన మొత్తం సొమ్ము చెల్లించిన తరువాతనే వ్యాపారాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అయితే అంజన్న ఆలయంలో టెండర్ సొంతం చేసుకున్న వారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు ప్రారంభించడం, బాధ్యులైన అధికారులు వీరి వ్యాపారాలకు అభ్యంతరాలు చెప్పక పోవడం తో ఆలయముకు వారు చెల్లించాల్సిన సొమ్మును వారి వద్ద నుంచి వసూలు చేయకపోవడం , తదితర కారణాల వల్ల. 2015, నవంబర్ మాసం నుండి, 2021 మార్చి మాసం వరకు దాదాపు 21 మంది వేలం దారుల నుండి అధికారులు డబ్బును వసూలు చేసి ఆలయ ఖాతాకు జమ చేయలేదని, రికార్డులలో నమోదైనట్టు సమాచారం.
ఏ దుకాణం వేలం పాట దారుడు ఎంత చెల్లించాలో వివరాలు ఇలా ఉన్నాయి !

కొబ్బరికాయల అమ్మకం దారు ₹ 1,60,000/- .ఫోటో స్టూడియో ₹ 8, 23, 449/- కొబ్బరి ముక్కల సేకరణ ₹.11, 00000/- కూల్ డ్రింక్స్ ₹ 20,000/-. గాజులు ప్లాస్టిక్ ఆట వస్తువులు, ₹ 22,75,000/- చెప్పుల భద్రపరుచు. ₹ 40,00000/- పువ్వులు పండ్లు అమ్మకం ₹ 20, 80 500/- పుట్నాలు మరియు పేలాలు ₹ 5,00000/- పాదరక్షలు భద్రపరుచు ₹ 85,000/- కిరాణా దుకాణం ₹.1,50,000/- హోటల్ నిర్వహణ. ₹ 11,55,000/- వంట చెరుకు అమ్మకం. ₹ 1,50,000/- టెంట్ హౌస్ ₹ 84,916/- తలనీలాలు ₹ 12, 23,000/- కొబ్బరి ముక్కలు ₹ 70,000/-. తలనీలాలు ₹ 2,92,50,000/- ఫోటో స్టూడియో ₹ 18,79, 272/- స్నానపు గదులు & మరుగుదొడ్లు ₹ 24, 42, 815/- హోటల్ నిర్వహణ ₹ 3,85,000/- కొబ్బరి ముక్కల ₹ 5, 60,5000/- ఫోటో స్టూడియో ₹ 9,50,000/- బకాయిలు ఉన్నట్టు రికార్డులో నమోదు అయినట్టు సమాచారం.