పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డా.జనార్దన్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా 503 ఖాళీలు..3.8 లక్షల అభ్యర్థులు!
1,019 పరీక్షా కేంద్రాలు!
జగిత్యాల జిల్లాలో 6885 మంది అభ్యర్థులు 21 కేంద్రాలు
( J. Surender Kumar )
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డా.జనార్దన్ రెడ్డి ఆదేశించారు.

బుధవారం ఆయన హైదరాబాద్ నుండి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 503 ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఈ ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. బయో మెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల హాజరు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 16 వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంట వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, బయోమెట్రిక్ విధానం ఉన్నందున అభ్యర్థులను పరీక్షా కేంద్రాల లోపలికి ఉదయం 8.30 నుండి అనుమతించాలని సూచించారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రవి.
మాట్లాడుతూ

జగిత్యాల్ జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 6885 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. చీఫ్ సూపరింటెండెంట్ లు, లైజన్, అసిస్టెంట్ లైజన్ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి, ఏర్పాట్లపై చర్చించడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సూచికల బోర్డులు అమర్చుతామని, టాయిలెట్స్, విద్యుత్ సదుపాయం, సీసీ కెమెరాలు సక్రమంగా ఉండేలా చూస్తామని అన్నారు. పరీక్షా సమయంలో ప్రతీ అరగంటకు ఒకసారి అభ్యర్థులకు సమయం తెలియజేసేలా సిబ్బందిని ఆదేశించడం జరిగిందని తెలిపారు.
ఎస్పీ సింధు శర్మ. మాట్లాడుతూ
ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద ఒక ఎస్సై స్థాయి అధికారితో పాటు, తమ సిబ్బంది ఉంటారని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్షా కేంద్రాలకు క్వశ్చన్ పేపర్ లు బందోబస్తు మధ్య తీసుకువెళ్తామని, ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్లు బిఎస్సి లతా అరుణ శ్రీ ఆర్డీవో మాధురి కలెక్టరేట్ ఏవో .రాజేందర్ కలెక్టర్ సూపరెంట్లు . డి ఈ ఓ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ ఆర్టికల్చర్ ప్రతాప్ సింగ్ మరియు కాలేజీ ప్రిన్సిపాల్ వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.