వందలాది కుటుంబాలలో గుండె కోత.
మృతుల సంఖ్య 60 కి పైగా
సస్పెన్షన్ వంతెనకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదా ?
( J. Surender Kumar)
గుజరాత్ లోని మోర్బి పట్టణంలో ” మచ్చు ” నదిపై 19 శతాబ్దంలో నిర్మించిన సస్పెన్షన్ వంతెన ఆదివారం సాయంత్రం 6 -7 గంటల మధ్య కూలిపోయింది. ఈ సంఘటనలో అధికారికంగా ప్రభుత్వం వెల్లడించిన మృతులు సంఖ్య 60 మంది. ఈ సంఖ్య మరింత పెరగవచ్చు అని అనధికారికంగా వెల్లడించారు. క్షతగాత్రులు 50 మందికి పైగా ఉండి ఉండవచ్చని, NDRS బృందాలు అంచనా వేస్తున్నాయి.

రాజుల కాలంలో వంతెన నిర్మాణం!

మోర్బి ని 1922 వరకు పాలించిన ఠాకోర్ పాలకులు దర్భాగడ్ ప్యాలెస్ – నాజర్ భాగ్ ప్యాలెస్ ( అప్పటి రాజవంశస్తుల నివాసాలు) కు అనుసంధానం కోసం యూరప్ సాంకేతిక నిపుణులతో కాళ్లత్మకంగా ఈ వంతెన నిర్మించారు దీని వెడల్పు, 1.25 మీటర్లు, పొడవు 233 మీటర్లు,

నాలుగు రోజుల క్రితమే సందర్శకులకు అనుమతి.
సస్పెన్షన్ వంతెన మరమ్మత్తుల నిమిత్తం 2022, మార్చి మాసంలో ఈ వంతెనపై సందర్శకులు రావడానికి నిషేధించారు. రేవ కంపెనీకి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను 15 సంవత్సరాల పాటు ప్రభుత్వం లీజుకు అప్పగించింది.. మార్చి మాసం నుంచి మరమ్మతులు చేపట్టిన ఈ సంస్థ అక్టోబర్ 26న వంతెన పైకి సందర్శకులను అనుమతించారు. ఈ సస్పెన్షన్ వంతెన మరమ్మత్తు పనులు పూర్తి అయిన తరువాత ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ స్థానిక మున్సిపల్ నుంచి జారీ చేయలేదని అధికారి సందీప్ జ్వాల పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.
సీఎం భూపేందర్ పటేల్ పరామర్శ!
మృతులను క్షతగాత్రులను గుజరాత్ ముఖ్యమంత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పక్షాన నాలుగు లక్షల ఆర్థిక సహాయం, ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. క్షతగాత్రులకు ₹ 50,000/-సహాయాన్ని ప్రకటించారు. NDRS, నేవీ బృందాలు సహాక చర్యలు రాత్రి నుంచి చేపడుతున్నారు.. ఇది ఉండగా ప్రమాదం జరిగిన సమయంలో వంతెన పై 150 మంది సందర్శకులు మాత్రమే ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష సంఘవి. వార్త సంస్థకు తెలిపారు.