(J.Surender Kumar)
నాలుగు నెలల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. నిధులు మంజూరై నాలుగేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడం పై విచారణ చేపట్టాలి . అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అధికారులు జిల్లా యంత్రంగా ఎం చేస్తుంది.. నిత్యం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రి సైతం ఇదే రోడ్డు గుండా వెళ్తున్న ఎందుకు పట్టించుకోవడం లేదు.. నిత్యం గుంతలతో ఇబ్బంది పడుతున్న వాహనదారుల కష్టాలు కళ్ళకు కనబడడం లేదా.? అంటూ ఆరోపణలు చేశారు.
రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే యావర్ రోడ్డును ట్రాఫిక్ తగ్గుతుందనే కనీస అవగాహన కొరబడిందా.? అంటూ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ ఇందిరా భవన్ లో ఆదివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2018 జూన్ లో జగిత్యాల బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు అయ్యాయని, 2018 సెప్టెంబర్ లో రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్ సంబంధిత ప్రభుత్వ విభాగం చేసుకున్నారని అన్నారు., TUFIDC ద్వారా నిధులు మంజూరు కాగా, రు.2.56.కోట్ల తో పనులకు టెండర్ వేశారు.
ట్విట్టర్ మంత్రి కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లోనే కాలం గడుపుతూ ట్విట్టర్ మంత్రిగా పేరు పొందాడని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు..

ఇదేనా తెలంగాణ మోడల్ అంటే, నిధులు మంజూరైన పనులు కనీసం ప్రారంభించిక పోవడం అధికార యంత్రాంగం ప్రభుత్వ పాలన తీరు అద్దం పడుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు . ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చలనం లేదని ధ్వజమెత్తారు., స్థానిక సంస్థల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ పోస్ట్ ను ఏర్పాటు చేశారని, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రాధాన్యత పనిని సైతం పూర్తి చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు అడిషనల్ కలెక్టర్ దృష్టికి రాలేదా?.. వచ్చిన ఉపేక్షించారా? ..సమాధానం చెప్పాలన్నారు.
రోడ్డు నిర్మాణ పని జాప్యానికి బాధ్యులు ఎవరు,? జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డులో రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుందని ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు. 2008లో బైపాస్ రోడ్డు వేయించామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఐదేళ్లకోసారి రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన కనీస బాధ్యతను సైతం అధికారులు మరిచారని ఆరోపించారు. బైపాస్ రోడ్డు లో గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం బైపాస్ రోడ్డు గుండా జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, మంత్రి సైతం వెళ్తున్నారని అయినప్పటికీ కూడా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
జాప్యంపై విచారణ కమిటీ వేయాలి., బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరై నా నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై వెంటనే ఉన్నత స్థాయి అధికారితో విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పనుల్లో జాప్యానికి నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇకనైనా పాలన యంత్రాంగం మేల్కొని బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, SC సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. రమేష్ బాబు . జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు. గుండ మధు .మండల అధ్యక్షులు జున్ను రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు. నేహల్ మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, యూత్ నాయకులు లైశెట్టి విజయ్ ,చాంద్ పాషా మాజీ సర్పంచ్. రాధకిషన్ పాల్గొన్నారు..
వైద్యుల సేవలు వెలకట్టలేనివి..

సమాజానికి వైద్యుల చేస్తున్న సేవలు వెలకట్టలేనివని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు., జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వైద్య శిబిరంతో నిరుపేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని, వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులను ఎమ్మెల్సీ అభినందించారు. వైద్యులకు మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని, నిరుపేద రోగులకు ఉచితంగా వైద్యం అందించేందుకు వైద్యులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రెక్క ఆడితే గాని డొక్కాడని నిరుపేద రోగులు ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనివ్వలన్నారు . నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవ అందించేందుకు కృషి చేయాలి అన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి..

మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిరుపేద మహిళలకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు అందజేసి వారికి తోడుగా నిలవడం వారి సామాజిక సేవకు నిదర్శనం అన్నారు. కుట్టుమిషన్లతో స్వయం ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధినిచ్చే స్థాయికి మహిళలు ఎదగాలని సూచించారు.
ధరూర్ వాకర్స్ అసోసియేషన్ కు ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ లో సభ్యత్వం.

ఈ కార్యక్రమంలో ధరూర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకోగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం వాకింగ్ ,యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉంటూ సమాజ సేవలో కూడా వాకర్స్ అందరూ పాల్గొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేయూతనివ్వాలని కోరారు. వాకర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ధరూర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులైన ఐలనేని వెంకటేశ్వరరావు, మరియు కార్యవర్గ సభ్యులకు సన్మానించి అభినందనలు తెలియజేశారు .

ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు గోపాల్ రెడ్డి, నరసింహారావు లు పాల్గొన్నారు. మరియు రైల్వే గేట్ వాకర్ అధ్యక్షులు రాజయ్య , మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, ఎస్ కె ఎన్ ఆర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర నర్సయ్య ,మాజీ అధ్యక్షులు రామచంద్రం, సలహా కమిటీ సభ్యులు బోయినపల్లి ప్రసాదరావు, ట్రెజరర్ సునీల్ కుమార్ ,ఉపాధ్యక్షులు ప్రతాప్ శేఖర్ సత్యం , వీరబత్తిని శ్రీనివాస్ ,బూస గంగాధర్ ,మల్లారెడ్డి ,ప్రకాష్, తిరుపతి రెడ్డి, సత్యం రావు, సుధాకర్ రావు పాల్గొన్నారు