జగపతిరావు. మరణం బాధాకరం
మంత్రి కొప్పుల ఈశ్వర్!

(J. Surender Kumar)


కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి వెలిచాల జగపతిరావు మరణం బాధాకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందగా గురువారం హైదరాబాదులోని వారి నివాసం లో వారి భౌతిక కాయాన్ని సందర్శించి మంత్రి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగపతి రావు  మరణించడం బాధాకరం, గొప్ప మానవతావాది, రాజకీయ ఉద్దండుని కోల్పోవడం రాష్ట్రం కు తీరని లోటు అన్నారు


నిధుల దుర్వినియోగం నిజమే….!
బుగ్గారం పంచాయతీలో ₹1.77 లక్షలు రికవరీ

 జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం నిజమేనని తేలింది. ₹ 1,77,761/-  గత విచారణలోనే రికవరీ చేసినట్లు అధికారిక లేఖ  వెలుగులోకి వచ్చింది. .కలెక్టర్ కార్యాలయం నుండి, 2022 సెప్టెంబర్ 22న లేఖ నం. ఎ3/1501/2020 విడుదల చేసినట్లు తెలిసింది. ఆలేఖ ప్రకారం బుగ్గారం సర్పంచ్ నుండి మూడు పద్దుల ద్వారా మొత్తం సొమ్ము    ₹1,77,761/- లు గత విచారణ లోనే  రికవరీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

అడ్వర్టైజ్మెంట్

గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై గత విచారణలో రూ.10,48,490 – 00 లకు షోకాజ్ నోటీసులు / మెమోలు జారీ చేసి వారిచే సమర్పించిన సంజాయిషీలు పరిశీలించి మరొకమారు తప్పిదాలు చేయకుండా కలెక్టర్ (పం. వి.) జగిత్యాల నుండి లేఖ తేది: 22-07-2021 ద్వారానే మండలించడం జరిగిందని ఆలేఖలో అధికారులు సూచించారు. కలెక్టర్ జోక్యం చేసుకొని  నిధుల దుర్వినియోగంపై చర్యలు చేపట్టాలని  పిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డి కోరారు. . ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్, నక్క చంద్రమౌళి, విడిసి వ్యవస్థాపక సభ్యులు పెద్దనవేని రాగన్న, సుంకం ప్రశాంత్ తదితరులున్నారు.