జగిత్యాల కలెక్టర్ కు టిఎన్జీఓల సన్మానం.


జగిత్యాల  జిల్లాకు జాతీయ స్థాయి లో స్వఛ్ఛ సర్వేకషన్ గ్రామీణ్ రెండవ ర్యాంకు సాధించి కేంద్ర మంత్రి .చేతుల మీదుగా అవార్డు  స్వీకరించిన జిల్లా కలెక్టర్ జి.రవి ని టిఎన్జీఓ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్, మరియు జిల్లా కార్యదర్శి నాగేందర్ రెడ్డి ,ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినారు. 

జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుచూ జాతీయ స్థాయి లో పేరు తీసుకువచ్చినందుకు టిఎన్జీఓల సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులందరి సహకారం ,వలననే జాతీయ స్థాయి అవార్డు  సాధించగలిగామని, ఇక  ముందు కూడా  జిల్లా ను ఇలాగే అన్ని కార్యక్రమాల్లో అగ్ర భాగాన నిలిపేందుకు కృషి చేద్దామని, జిల్లా లోని ఉద్యోగులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో tresa వకీలు,  సంఘ నాయకులు రవిందర్, షాహిద్ బాబు, మధుకర్, సుగుణాకర్, చంద్రిక, మమత, రాజశ్రీ పాల్గొన్నారు.
రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో


జిల్లా కలెక్టర్ గారికి సన్మానం జాతీయ స్థాయిలో జగిత్యాల జిల్లాకు అవార్డు రావటం పట్ల సమస్త రెవెన్యూ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యం.డి.వకీల్. కార్యదర్శి కృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణ చైతన్య. తహశీల్దార్ లు.మహేశ్వరు. నవీన్.రవీందర్. ఆరిఫోద్దీన్. ఫారూఖ్.బషీర్.  నాగార్జున.  రెవెన్యూ సిబ్బంది వర ప్రసాద్.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
అవార్డుల ప్రధానం!


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వఛ్చ సర్వెక్షాన్ 2022 స్వఛ్చత లీగ్ అవార్డు అందుకున్న మున్సిపాలిటీలు మరియ కార్పొరేషన్ లకు  MCR HRD హైదరబాద్ నందు మంగళవారం మున్సిపల్ అడ్మనిస్ట్రేటివ్ మరియు ఐటీ శాఖల మంత్రి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది
తెలంగాణ మున్సిపల్ అడ్మనిస్ట్రేటివ్ మరియు ఐటీ శాఖల మంత్రి శ్రీ KTR మారియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ , కోరుట్ల మున్సిపాలిటీ కి  శ్రీ మతి అరుణ శ్రీ, అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు  మరియ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య  మునిపల్ కమిషనర్ అయాజ్  అవార్డు అందజేయడం జరిగింది