ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఆధ్వర్యంలో!
(J. సురేందర్ కుమార్)
విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆకాంక్షించారు.

పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో ఎస్పీ ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు., విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.

పూజా కార్యక్రమాలలో డిఎస్పీ లు ప్రకాష్, రవీంద్ర రెడ్డి, రిజర్వ్ ఇన్స్ పెక్టర్లు వామనమూర్తి, నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.
దుర్గాదేవి నిమజ్జనంలో అపశ్రుతి
కాలువలో గల్లంతైన పూజారి !

మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన పూజారి బింగి ప్రసాద్ స్వామి సమీపంలోని కొంపల్లి వద్ద బుధవారం ఎస్సారెస్పీ కెనాల్ లో ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. దుర్గాదేవి నిమజ్జనం చేసే ప్రక్రియ లో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు గాలిస్తున్నారు.
ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే సుంకే రవి శంకర్
స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెంటనే ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. కెనాల్ లో వాటర్ ప్లో నిలిపివేయాలని కోరారు.