కాపు అవార్డు గ్రహీతలకు సన్మానం !

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో!


( J.Surender Kumar )
ధర్మపురి పట్టణ మున్నూరు కాపు అవార్డు గ్రహీతలకు ఆదివారం సంఘ భవనంలో ఘన సన్మానం జరిగింది.

సంఘం అధ్యక్షులు సంగి రాజశేఖర్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో కృషిచేసిన మున్నూరు కాపుకు చెందిన వారిని సన్మానించారు. ధర్మపురి అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన తిరుమాందాస్ సత్యనారాయణ, ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎన్నికైన చెరుకు రాజన్న , ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన కాశెట్టి రమేష్ , ఐజేయు జగిత్యాల జిల్లా ఈసీ మెంబర్గా ఎన్నికైన బొంగురాల రాజేష్, కరీంనగర్ డివిజన్ ఎల్ఐసి ఉపాధ్యక్షులుగా ఎన్నికైన భారతపు గుండయ్య , మున్నూరు కాపు సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి చల్లా రవి , మున్నూరు కాపు కౌన్సిలర్లు అయ్యోరి వేణు, బండారి అశోక్ , ఒడ్నాల ఉమాలక్ష్మి , కొంపల పద్మ, కో ఆప్షన్ సభ్యులు అప్పల వసంత్, ప్రభుత్వ పాఠశాలలో చదివి. 10/10 జీబీ సాధించి బాసర త్రిబుల్ ఐటీ సీట్ పొందిన అయ్యోరి ప్రత్యూష , ఎంసెట్ 1450 ర్యాంకును పొందిన చల్ల హర్షవర్ధన్ , లను అధ్యక్షుడు సంగి శేఖర్ సన్మానించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ ,సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బండి మురళి , మున్నూరు కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చల్ల జనార్ధన్ , ప్రధాన కార్యదర్శి చల్ల గంగన్న, ఉపాధ్యక్షులు తోట రాజన్న , కాశెట్టి రాంబాబు, పురం శెట్టి నాగేష్ , ఆశెట్టి శ్రీనివాస్ ,కార్యదర్శులు ఆకుల శ్రీనివాస్, గ చిర్నేని నరసయ్య , ఓడ్నాల భూమేష్ , తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంఘం అధ్యక్షుడుగా స్తంభంకాడి శ్యాం !


ధర్మపురి పట్టణ బీసీ సంక్షేమ అధ్యక్షులుగా స్తంభం కాడి శ్యాం ను ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ముసిపట్ల లక్ష్మీ నారాయణ ,విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాజాల రమేష్ నియమించారు . ఈ సందర్భంగా శ్యాం
మాట్లాడుతూ
గత కొద్ది సంవత్సరాలుగా బీసీ సమస్యలపై స్పందిస్తూ వివిధ బాధ్యలు నిర్వర్తించిన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తానని అన్నారు.