కాంగ్రెస్ మహిళా నాయకులు ధ్వజం!
(J. Surender Kumar)
సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ను ప్రారంభించినట్టు మీరు భజన చేస్తున్నారు, కానీ మా తాతలు కాలం నుండి బతుకమ్మను మేము బతుకమ్మలు ఆడుతున్నాం, ఇప్పుడు కవిత ఆడితేనే మేము ఆడటం లేదు, అంటూ ధర్మపురి మహిళా కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ మహిళా విభాగం నాయకుల పై ధ్వజమెత్తారు.
ధర్మపురిలో ఆదివారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. శనివారం టిఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన ఆరోపణలకు వీరు ప్రతి ఆరోపణలు చేశారు.
వారి మాటల్లో…
ఒకరిపై ఆరోపణలు చేస్తే అవి అర్థవంతమైన, సంస్కరవంతమైన, హుందాతనమైన భాషను వాడాలి.
ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువ అన్నా విధంగా ఊసరవెల్లి రంగులు మార్చినట్టు డబ్బులకు ఆశపడి ఎవరు అధికారంలో ఉంటే వారి పార్టీలో చేరే మీరు లక్ష్మణ్ కుమార్ పై ఆరోపణలు చేసే అర్హతలు ఉన్నాయా ? అని ప్రశ్నించారు .
మీరు పాత్రికేయుల సమావేశంలో. మాట్లాడిన మాటలు, ఉపయోగించిన భాష ,తిరిగి మేము చెప్పడానికి మహిళలుగా సభ్యత కాదు అని భావిస్తున్నామన్నారు.
అభివృద్ధి, అభివృద్ధి అని మాట్లాడే మీరు గత 8 సంవత్సరాలుగా ధర్మపురి ఎం అభివృద్ధి చేసారో చెప్పగలరా ? అంటూ చైర్ పర్సన్ ను ప్రశ్నించారు.
రోడ్లు వెడల్పు పనుల విషయంలో కౌన్సిల్ తీర్మానాలు ఎన్ని చేశారు ? మీకు నచ్చిన వారి పట్ల, ఒకవిధంగా నచ్చని వారి పట్ల, మరోవిధంగా పనులు చేశారని పేర్కొన్నారు.
జడ్పీటీసీ, మున్సిపల్ చైర్ పర్సన్ స్థాయిలో ఉండి మీరు ఈ విధముగా మాట్లాడుతూ ప్రజలకు ఎం నేర్పిస్తున్నారు అంటూ ప్రశ్నించారు.
మంత్రి ఈశ్వర్ నిజాతిగా గెలిచి ఉంటే, ఎన్నిక కౌంటింగ్ లో రికార్డు అయిన వీడియోను ఎందుకని బైటకి రానివ్వడం లేదు అంటూ ప్రశ్నించారు.
ఎల్.ఎం కొప్పుల ట్రస్ట్ ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి ,ఇంత ఆడంబరంగ కార్యక్రమలు నిర్వహిస్తుంటే, మాకే కాదు ప్రతి పౌరుడికి అనుమానం కలుగుతుందన్నారు.
మున్సిపల్ సమావేశంలో, కార్యక్రమలలో ప్రోటోకాల్ పాటించడం లేదు. దీని గురించి ప్రశిస్తే చైర్ పర్సన్ నుండి సరైన సమాధానం రావడం లేదు అన్నారు.
ఎవరైతే లక్ష్మణ్ కుమార్ కు పసుపు కుంకుమ, పంపిస్తా అని నిన్న అన్నారో, వారికి చెప్తున్నాం మీరు పంపించండి మేము స్వాగతిస్తాం కానీ పంపించే అర్హత మీకు ఉందా.? అంటూ ప్రశ్నించారు
సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో మన ధర్మపురి మున్సిపాలిటీ ఎందుకని అభివృద్ధి చెందడం లేదో.దాని గురించి ఆలోచించండి అన్నారు.
సమావేశంలో మునిసిపల్ ఫ్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి, కౌన్సిలర్లు సంగనభట్ల సంతోషి, గరిగే అరుణ , ముత్తునూరు ఎంపీటీసీ సభ్యురాలు మంజుల , చిలుముల లావణ్య, కుంట రజిత, ఆశెట్టి మమత ,చీటన్నోజు స్వప్న, ఇంద్రాల ప్రమోద ,తదితరులు పాల్గొన్నారు