కెసిఆర్ పార్టీ ప్రకటన ముహూర్తం కాదు!
రిజిస్ట్రేషన్ ముహూర్త సమయం కీలకం !

ప్రముఖ జ్యోతిష్యుడు సంతోష్ కుమార్ శాస్త్రి

నేడు సీఎం కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన!

( J.Surender Kumar)
కెసిఆర్ త్వరలో జాతీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, కేసీఆర్ జాతకం ప్రకారం ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తులో పార్టీ భావి పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన జాతక రీత్యా ఎలా ఉండబోతోందో

గొల్లపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి జ్యోతిష్యుడు

.

ప్రస్తుతం బుధవారం దసరా రోజు జాతీయ పార్టీ పేరు, మరియు కార్యచరణ ప్రకటిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది ఆ రోజు సమయం ఏ విధంగా ఉంది, ఆ సమయాన్ని బట్టి పార్టీ భవిష్యత్తు ఎలా ,? ఉండబోతోంది, అని ఊహాగానాలు, మరియూ ముహూర్త సమయాన్ని బట్టి భవిష్యత్తు అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో పార్టీ పుట్టిన సమయంగా భావించరాదు. కాబట్టి దీనికి ఎటువంటి విలువ లేదు. అధికారికంగా పార్టీ రిజిస్ట్రేషన్ అయినా సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తు అంచనా వేయడం సరైన పద్దతిగా నేను భావిస్తాను. అని పండితుడు గొల్లపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు.
పార్టీ భవిష్యత్తు అంచనా వేయలేము !
ప్రస్తుతానికి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ అధికారికంగా, రిజిస్ట్రేషన్ కానందున, ఆ జాతీయ పార్టీ భవిష్యత్తు అంచనా వేయడం జ్యోతిష్య శాస్త్రం మేరకు కచ్చితంగా విశ్లేషించడానికి వీలు కుదరదని జ్యోతిష్యుడు గొల్లపల్లి సంతోష్ శర్మ అన్నారు.. సీఎం కేసీఆర్ జాతకరీత్యా , భవిష్యత్తు అంచనా విశ్లేషణకు అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం కేసీఆర్ రాహు మహాదశలో, చంద్ర భక్తి నడుస్తున్నది. ఇది వచ్చే సంవత్సరం ఆగస్ట్ ,వరకు ఉంటుంది. గోచార రిత్య, గురువు అనుకూల గోచారం వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఉంటుంది. జనవరిలో శని ఎనిమిదవ ఇంటికి రావడం, అలాగే డిసెంబర్ మౌఢ్యం ఉండటం వలన, పార్టీ ప్రకటన స్వయం సిద్ధ మూహూర్త మైన విజయదశమి రోజు చేస్తున్నారని భావించవచ్చన్నారు.
డిసెంబర్లో పార్టీ కార్యాలయం ప్రారంభం.?
స్వయంగా జ్యోతిశ్శాస్త్రం మీద మంచి అవగాహనా, నమ్మకం ఉన్న కేసీఆర్ పార్టీ ప్రకటన కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఇప్పుడు చేసినప్పటికీ, పార్టీ ఆఫీస్ ప్రారంభం చేయటం మాత్రం శుక్ర మౌఢ్యమి అయ్యాక డిసెంబర్‌లో చేయనున్నారు కావచ్చు
ప్రస్తుతం కేసీఆర్ కు నాలుగవ ఇంటిలో కేతు గోచారం, ఏడవ ఇంట శని గోచారం, అనుకూలంగా లేకపోవడం వలన అంతర్గతంగా, బహిర్గతంగా కొంత వ్యతిరేకత ఏర్పడ్డప్పటికీ, గురు గోచారం అనుకూలంగా ఉండటం అలాగే పదవ ఇంటిలో రాహు గోచారం, సాహసోపేతమైన నిర్ణయాలు, చర్యలు తీసుకునేలా చేయడం వలన, వ్యతిరేకత ఉన్నప్పటికీ, అది ఆయన నిర్ణయాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు.
అయితే ఏప్రిల్ 2023 మరియు అక్టోబర్ 2023 మధ్యన గురువు, శని ,మరియు కేతు గోచారం పూర్తిగా అనుకూలంగా లేకపోవడం, ఆగస్ట్ నుంచి రాహు మహర్దశలో, కుజ అంతర్దశ , ప్రారంభం అవ్వటం వలన చేపట్టిన పనులు పూర్తిచేయడానికి ఎక్కువగా శ్రమించాల్సి రావచ్చు. ఆక్టోబరు చివర్లో రాహు, కేతువుల గోచారం మారటం వలన మళ్లీ కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే 2024 మే మాసంలో, గురు గోచారం తిరిగి అనుకూలంగా మారటం, సెప్టెంబర్ నుంచి యోగకారక గురు మహాదశ ప్రారంభం అవటం వలన ,అది వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అనుకూల ఫలితం సాధించటానికి సాయపడుతుంది.
కెసిఆర్ జాతకకుండాలి !


కెసిఆర్ మేష లగ్నం కర్కాటక రాశిలో జన్మించారు. ఆయన జాతకంలో 2స్థానమైన వృషభ రాశి, లో గురువు 3వ స్థానం అయిన మిధున రాశిలో, కేతువు 4వ ఇంట్లో స్వక్షేత్ర మైన కర్కాటక రాశిలో చంద్రుడు 7వ,ఇంట తన ఉచ్ఛ రాశి అయిన తులా రాశిలో, శని 8వ ఇంట స్వక్షేత్ర మైన వృశ్చిక రాశిలో, కుజుడు 9వ ఇంట ధనురాశిలో, రాహువు 11వ ఇంటిలో, బుద్ధులు, శుక్రుడు, మరియు సూర్యుడు ఉన్నారు. ప్రస్తుతం రాహు మహాదశ లో, చంద్రుని అంతర్దశ నడుస్తున్నది. ఈ అంతర్దశ వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు ఉంటుంది. అలాగే గోచారాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరం గురువు గోచారం 7 ఇంటిలో అనుకూలంగా ఉండటం, శని గోచారం 7 మరియు 8వ ఇంటిలో ఉండటం అలాగే 4వ ఇంటిలో కేతు గోచారం 10వ ఇంటిలో రాహు గోచారం ఈ సంవత్సరమంతా ఉంటుంది.

దీని కారణంగా కెసిఆర్ జీవితంలో వ్యక్తిగతంగా, మరియు రాజకీయంగా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దశ అధిపతి మరియు అంతర్దశ అధిపతి షష్టాష్టకాల్లో ఉండటం వలన, పనుల విషయంలో ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరమంతా , ప్రయాణాలు అధికంగా ఉంటాయి. 4వ ఇంట చంద్రుడు సొంత రాశి లో ఉన్నప్పటికీ బాల్యావస్థ లో ఉండటం వలన అలాగే రాహు అంతర్దశ నడవడం వలన ఈ సమయంలో చేపట్టిన పనుల్లో విజయం సాధించడానికి మానసికంగా మరియు శారీరకంగా ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే చంద్రుడి నుంచి రాహు గోచారం 10వ ఇంట్లో ఉండటం, లగ్నం నుంచి 1వ ఇంట్లో ఉండటం వలన ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ మొండి పట్టుదలతో సాహసోపేతమైన నిర్ణయాలు తో ముందుకు దూసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి జన్మరాశి పై ఉండటం వలన, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు, మరియు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల , సహాయ సహకారాలు అందుకుంటారు. దాని కారణంగా చేపట్టిన పనుల్లో విజయం సాధించగలుగుతారు. అయితే సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా లేకపోవడం, వలన శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష శత్రువులే కాకుండా పరోక్షంగా కూడా చెడు చేయాలనుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది . అంతేకాకుండా సమయానికి చేయాల్సిన సాయాన్ని చేయకుండా, పక్కకు తప్పుకునే వారి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం వలన ఏ రకమైన సమస్యలు లేకుండా అనుకున్నది సాధించగలుగుతారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా తనదంటూ ఒక ముద్ర వేసే అవకాశం ఉన్నది. అయితే దీనికొరకు సొంత బలం ని నమ్ముకోవాలి తప్ప ఇతరులపై, ఎక్కువగా ఆధారపడకుండా ఉండటం మంచిది. ఏప్రిల్ వరకు గురువు, గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి, పనుల్లో మరియు ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ తర్వాత గురువు శని మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండదు, కాబట్టి వీలైనంతవరకూ జాగ్రత్తగా ఉండటం, అలాగే వివాదాస్పద నిర్ణయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. అంతే కాకుండా ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.