కొండగట్టు ఆదాయముకు గండి?
(పార్ట్ -4)
(J. Surender Kumar)
కొండగట్టు ఆంజనేయ స్వామికి తలనీలాలు, మొక్కలు సమర్పించుకోవడానికి వచ్చే భక్తుల తలనీలాలు తీయడం కోసం, నాయిని బ్రాహ్మణులకు ₹ 1,36, 209/ నిధులతో బ్లేడ్లు కొనుగోలు చేసినట్టు ఆలయ అధికారులు రికార్డులలో నమోదు చేశారు.

లాక్ డౌన్ వేళలో తలనీలాలు తీయించుకున్న భక్తులు ఎవరో ?. ఆలయ అధికారులే వివరించాల్సిన అవసరం ఉంది.

.బ్లేడులు, కొనుగోళ్లకు ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా “రూపేష్ ట్రేడర్స్” . ద్వారా తేదీ 8-12-2020, రసీదు నంబర్ 259 ద్వారా, ₹ 35, 155/- తేదీ .16-03-2021, .రసీదు నంబర్ 410, ద్వారా ₹ 30, 755/- తేదీ. 25-3-2021, రసీదు నంబర్ 428 ద్వారా, ₹ 70,299/- మూడువిడతలుగా, మొత్తం ₹.1,36,209/. చెల్లించి కొనుగోలు చేసినట్టు. రికార్డులో నమోదు అయింది.

లాక్ డౌన్ వివరాలు ఇలా వున్నాయి!
కోవిడ్-19 నేపథ్యంలో దేశవ్యాప్తంగా 25 మార్చ్, 2020 నుండి 14 ఏప్రిల్, 2020 వరకు. 15 ఏప్రిల్ నుండి 3. మే,2020, వరకు, 4 మే నుంచి 17 మే,.2020 వరకు, 18 మే, నుండి 31 మే 2020 వరకు, 2021 మే 12 నుంచి జూన్ 19 కొరకు 10 జూన్ నుంచి 2021 జూన్ 19 వరకు అమల్లో ఉంది. అయితే జన సమర్థమైన ప్రాంతాలు, పెళ్లిళ్లు, ఆలయాలు, జాతర ఉత్సవాలు, పండగలను కోవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రాణాలు పణంగా పెట్టి భక్తులు కొండగట్టు క్షేత్రానికి భారీ సంఖ్యలో తరలివచ్చినట్టు బ్లెడ్ల్ కొనుగోలు ద్వారా ఆలయ అధికారులు ప్రపంచ రికార్డును సృష్టించారు అని గిన్నిస్ బుక్ లో నమోదు కావచ్చు కాబోలు.

రెండు లక్షల మంది తలనీలాలు సమర్పించారా ?
అంజన్న భక్తులు తలనీలాలు చేయడం కోసం నాయిని బ్రాహ్మలకు.₹, 1,36,209/- నిధులతో బ్లేడ్లు కొనుగోలు చేసినట్టు రికార్డులో ఉంది. మార్కెట్లో బ్లేడు ప్యాకెట్ ఒక్కటి ₹ 1/- ధర చొప్పున లెక్కించిన 136209 బ్లేడ్లను, తలనీలాలు తీసే నాయిని బ్రాహ్మణులకు అందించి ఉండవచ్చు,. ఒక బ్లేడు రెండు ముక్కలుగా, చేసి ఇద్దరు భక్తుల తలనీలాలు తొలగించడం సర్వసాధారణం. ఇదే విధానం తిరుమల తిరుపతి లో కూడా అమలులో ఉంది. ఈ లెక్కన కొనుగోలు చేసిన బ్లేడ్లులు, వినియోగించిన అవి దాదాపు రెండు లక్షల 72 వేల 418 భక్తులకు వీటి వినియోగం జరిగి ఉండి ఉండవచ్చు. విజయ్ , తీజ్, లేజర్ బ్రాండ్, బ్లేడ్లు సాధారణంగా వినియోగిస్తారు. తిరుమలలో మాత్రం ” 7 ‘ O Clock ” బ్రాండెడ్ బ్లేడ్లను వినియోగిస్తారు. “7 ‘ O Clock బ్రాండ్ బ్లేడ్లు, మార్కెట్లో ఒక్క బ్లేడు ధర ₹ 10/- ఉంటుందని వ్యాపార వర్గాలు, వివరిస్తున్నారు.
డిపాజిట్ గోల్ మాల్ ?
ఫిక్స్డ్ డిపాజిట్ (రీ ఇన్వెస్ట్మెంట్) సొమ్మును 2016-17 లో. చేసి అట్టి సొమ్ము ఖర్చు నవంబర్ 2018 న, అధికారులు నగదు పుస్తకంలో నమోదు చేశారు. వివరాలు. ఇలా వున్నాయి. ₹ 34,38,064/- ఆలయ సొమ్మును. జనవరి 2016లో డిపాజిట్ చేశారు. FDR No. 77,37,96. ఈ సొమ్మును అలహాబాద్ బ్యాంకు ఖాతా నుంచి T.R (ట్రాన్స్ఫర్ రిసిప్ట్) No.50196722305 నుంచి SBI JNTU నాచుపల్లి బ్రాంచ్ ఖాతా కు బదిలీ చేశారు. ఇట్టి సొమ్ము ఖర్చును 2018 నవంబర్ మాసంలో అధికారులు నమోదు చేశారు. 2016-17 డిపాజిట్ ఖర్చును 2018 నవంబర్ లో, ఖర్చు చేసినట్టు నగదు పుస్తకంలో నమోదుకు కారణాలు ఏంటో అధికారులే చెప్పాల్సి ఉంటుందనే ఆరోపణలు వారిపై ఉన్నాయి.
ఆదాయం ,- ఖర్చుల వివరాలు కేవలం మూడు ఆర్థిక సంవత్సర లో రికార్డులలో నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.
– ఏప్రిల్ 2018 నుంచి 2019 మార్చి మాసం వరకు:–
. ₹ 17 కోట్ల, 63 లక్షల, 11 వేల 802. రూపాయలు.
ఖర్చు ₹ 18 కోట్లు, 22 లక్షల, 24 వేల 838 రూపాయలు.
ఆదాయం కన్నా అదనంగా ₹ 59. లక్షల 13 వేల 036 రూపాయల ఖర్చు చేశారు.
-:2019 ఏప్రిల్ నుంచి 2020. మార్చిమాసం వరకు:-. ఆలయం కు వచ్చిన ఆదాయం ₹ 20 కోట్ల, 37 లక్షల, 31 వేల 443 రూపాయలు. ఖర్చు ₹ 18 కోట్ల, 07 లక్షల, 94 వేల 859 రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరం ఆలయం కు ₹ 2 కోట్ల, 29 లక్షల, 36 వేల, 584 రూపాయల ఆదాయం వచ్చినట్టు రికార్డులు నమోదు అయ్యింది.
– 2020 ఏప్రిల్ మాసం నుంచి 2021 మార్చి మాసం వరకు:-
ఆలయం కు మొత్తం ఆదాయం ₹ 11 ఓట్ల, 48 లక్షల, 65 వేల, 116 రూపాయలు వచ్చాయి. ఖర్చు ₹ 12 కోట్ల, 16 లక్షల, 36 వేల, 594 రూపాయలు చేశారు. ఆదాయం కన్నా అదనంగా ₹ 67 లక్షల 71 వేల, 478 రూపాయలు అయినట్టు రికార్డులో అధికారులు నమోదు చేశారు.