కొండగట్టు ఆలయంకు (పార్ట్-3)
(J.Surender Kumar)
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంకు చెందిన దుకాణాలలో కిరాయికి ఉండి, తమ తమ వ్యాపారాలు నిర్వహించుకుంటూ, తమ, తమ కుటుంబాలను పోషించుకుంటున్న కిరాయిదారులు. ఆలయంకు చెల్లించాల్సిన లక్షలాది రూపాయల కిరాయి డబ్బులు, సంవత్సరాల తరబడి చెల్లించకపోయినా, అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని, కిరాయి డబ్బులు వసూలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

సంవత్సరాల తరబడి కిరాయి డబ్బులు ఎగవేత !

కొండగట్టు దేవస్థానం కు చెందిన దుకాణాల సముదాయం లో దాదాపు 12, దుకాణాల కిరాయి డబ్బులను కిరాయి దారులు, సంవత్సరాలుగా చెల్లించడం లేదు. వారి వద్ద నుంచి ₹ 3,35,875/- కిరాయి సొమ్ము ఆలయముకు రావాల్సి ఉంది.
వాటి వివరాలు.

షాప్ నెంబర్, (3), ఏప్రిల్,2019 నుంచి నవంబర్ 2021 వరకు. ₹ 35,000/- షాప్ నెంబర్, (13), ఏప్రిల్ 2019 నుంచి మార్చ్ 2021 వరకు ₹ 18,000/- షాప్ నెంబర్, (14), ఆగస్టు 2017 నాటికి ₹ 11,000/- షాప్ నెంబర్, (7), నవంబర్ 2016 నుంచి అక్టోబర్ 2017 వరకు ₹ 10,000/- షాప్ నెంబర్, (9) నవంబర్ 2016 నుంచి అక్టోబర్, 2021 వరకు ₹ 23, 375/- షాప్ నెంబర్, (1), డిసెంబర్ 2016 నుంచి అక్టోబర్ 17 వరకు ₹ 46,000/- షాప్ నెంబర్, (7) నవంబర్ 2019 నుంచి అక్టోబర్, 2021. వరకు ₹ 10,000/- షాప్ నెంబర్, (5) ఏప్రిల్ 2019 నుంచి మార్చ్ 2021 వరకు ₹ 15,000/- షాప్ నెంబర్, (11) ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2021 వరకు, ₹ 30,000/- షాప్ నెంబర్, (15) .ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2021 వరకు,₹ 5000/- షాప్ నెంబర్, (2) ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2021 వరకు ₹ 50,000/- షాప్ నెంబర్, (1) డిసెంబర్ 2019 నుంచి నవంబర్ 2021 వరకు ₹ 52,500/- షాప్ నెంబర్, (14) ₹ 30,000/- మొత్తం ఆలయానికి మూడు లక్షల 35 వేల 875/-. రూపాయలు. కిరాయి దారులు బకాయి ఉన్నట్టు రికార్డులో ఉంది.
అప్పు వసూలు చేయని పద్దు మరో ₹ 7,50,000/-

కొండగట్టు ఆలయ నిధుల నుంచి, హైదరాబాదు, దిలిసుఖ్ నగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంకు, ఆగస్టు 2020 న అప్పుగా ₹ 7,50,000/ ఇచ్చారు. .ప్రతి నెల ₹ 25,000/- చొప్పున 30 నెలలలో ఈ డబ్బులు చెల్లిస్తానంటూ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి, కొండగట్టు ఆలయ అధికారులకు “ఇట్టి డబ్బులకు బ్యాంకు వడ్డీ 6% తో కలిపి చెల్లిస్తానంటూ” ప్రామిసరీ నోటు కూడా రాసి ఇచ్చారు. మార్చి 2021 నాటి వరకు ఒక్క రూపాయి కూడా కొండగట్టు దేవస్థాన అధికారులు వారి వద్ద నుండి వసూలు చేయనట్టు రికార్డులలో నమోదు అయినట్టు సమాచారం.