లక్ష్మణ్ కుమార్ కరోనా విపత్తులో నువ్వు ఎక్కడ..?

ధర్మపురి అసెంబ్లీ టిఆర్ఎస్ మహిళా విభాగం ధ్వజం!


( J.Surender Kumar )
కరోనా విపత్తు సమయంలో కాంగ్రెస్ నేత లక్ష్మణ్ కుమార్, ఏ వర్గాలకు సహాయ సహకారం అందించారు? ఎక్కడున్నారో చెప్పాలని, ధర్మపురి అసెంబ్లీ పరిధి టిఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాళ్లు లక్ష్మణ్ కుమార్ పై ధ్వజమెత్తారు.
శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్ పై, ఎమ్మెల్సీ కవితపై, ఎల్ఎం కొప్పుల చారిటీ ట్రస్ట్ పలు ఆరోపణలు చేస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం నియోజకవర్గ మహిళా విభాగం నాయకురాళ్లు ధర్మపురి పట్టణంలో నంది విగ్రహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి లక్ష్మణ్ కుమార్ తీరుపై పలు ఆరోపణలు చేశారు.

  • విలేకరుల సమావేశంలో ప్రధాన అంశాలు
    కాంగ్రెస్ పార్టీ పాలనలో ధర్మపురి నియోజకవర్గ మహిళలకు ఎం చేసారు ?
    👉🏻తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల విశ్వవ్యాప్తంగా పరిచయం చేసిన తెలంగాణ నిజాంబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత ను విమర్శించడం లక్ష్మణ్ కుమార్ దిగజారుడుకు తనానికి నిదర్శనం.
    👉🏻ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారు, అంటే దానికి కారణం కవితక, బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు .
    👉🏻ఆడపడుచులకు పట్టు చీరలు కట్టుకొని, బంగారు నగలు పెట్టుకుని బతుకమ్మ ఆడటానికి వేలసంఖ్యలో, వచ్చినప్పుడు భద్రత కల్పించాల్సిన కనీస బాధ్యత పోలీస్ అధికారులదే. ఆ విషయం తెలియ కుండా మాట్లాడడం తెలివి తక్కువ తనానికి నిదర్శనం అన్నారు.
  • 👉🏻LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేది స్వచ్ఛంద సంస్థ, సోషల్ సర్వీస్ ద్వారా కరోన కష్టకాలంలో వేలాది మందికి భోజనాలు పెట్టడం జరిగింది, ధర్మపురి పట్టణంలో 45 రోజుల పాటు మరియు నియోజకవర్గం మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, రాష్ట్రానికి సంబందం లేకుండా వలుస కూలీలకు , రెండుపూటలా భోజనాలు ఏర్పాటు చేశారన్నారు. లక్ష్మన్ కుమార్ నువ్వు ఆ సమయం లో ఎక్కుడ ఉన్నావు.?
  • ధర్మపురి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు కొప్పుల ట్రస్ట్ ద్వారా గ్రూప్స్, కానిస్టేబుల్, కోచింగ్ విద్యార్థిని, విద్యార్థులకు 3 నెలల పాటు ఉచితంగా కోచింగ్ ఇచ్చి, స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది.
  • తల్లిదండ్రులు లేని ఎంతో మంది నిరుపేద అమ్మాయిల వివాహానికి చేతనైనంత సాయం చేస్తున్నారు
    👉🏻 ధర్మపురి ప్రాంతంలో అంతరించిపోతున్న తెలంగాణ కళా వైభవాన్ని చాటే విధంగా ఉగాది ఉత్సవాలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా సేవ చేసిన వ్యక్తులకు గౌరవించారు .
    👉🏻ఇతరులను గౌరవించడం తప్పు అని మీరు అనుకుంటే మేము చేసేది ఏమీ లేదు.
    👉🏻కరోనా కష్టకాలంలో వేరే రాష్ట్రంలో ఉన్న ధర్మపురి నియోజకవర్గ ప్రజలను ఆర్థికంగా ఆదుకున్న చరిత్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దే.
    👉🏻సుమారు 45 వేల కుటుంబాలకు, సీఎం.ఆర్ఎఫ్, ఎల్వో సి ఇప్పించిన చరిత్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ది.
  • 👉🏻ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుక్షణం తపన పడుతూఉంటే నువ్వు ఓర్వలేక సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నావు
    👉🏻గడిచిన నాలుగు ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు నిన్ను నిద్ర లేకుండా చేస్తుంది మీకు ఏంఅర్థం అవడంలేదు
    👉🏻2009లో కొత్తగా ఏర్పడిన ధర్మపురి నియోజకవర్గం లో కొప్పుల ఈశ్వర్ గారు ఎవరు ఎవరికీ తెలియదు కానీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి, పాత బుగ్గారం నియోజకవర్గం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రత్నాకర్ రావు గ మంత్రిగా ఉన్నారు.
    పక్కనా జగిత్యాల జిల్లా జీవన్ రెడ్డి మంత్రి గా ఉన్నారు లక్ష్మన్ కుమార్, నువ్వు అప్పటికే కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నావు అయిన కొప్పుల ఈశ్వర్ గెలిచారు .
    👉🏻నువ్వు ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఎన్నిక చాలు ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా నువ్వు పోటీ చేస్తే 58,654 ఓట్ల తేడాతో ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓడించారు.
    👉🏻ప్రోటోకాల్ , పోలీసులను గురించి
    నువ్వు మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారు
    👉🏻నువ్వు మరోసారి మా బతుకమ్మ పండుగను, మా కవితక ను మా ఈశ్వరన్న విమర్శిస్తే కచ్చితంగా మా ఆడపడుచులు, అందరూ నీకు పసుపు, కుంకుమ, గాజులు పంపిస్తామని సమావేశంలో హెచ్చరించారు.
    పాత్రికేయుల సమావేశంలో ధర్మపురి మున్సిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, స్థానిక జడ్పీటిసి సభ్యురాలు బత్తిని అరుణ, ధర్మారం జెడ్పీటీసీ సభ్యురాలు పూస్కురు పద్మజ, వెల్గటూర్ యంపిపి, కూనమల్ల లక్ష్మీ, వైస్ యంపిపి కవిత, పెగడపల్లి గోలి శోభ, ధర్మపురి నియోజకవర్గం మండలాల మహిళల అధ్యక్షురాళ్లు బుగ్గారం ,రేపూరి సుజాత, పెగడపల్లి, మమత, వెల్గటూర్, సిధూజ, ధర్మపురి ఉమారాణి, ధర్మారం కనకలక్మీ, కౌన్సిలర్లు, ఉమాలక్మీ, కిరణ్మయి, విజయలక్ష్మీ, ధర్మారం మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, కాంపెల్లి అపర్ణ తదితరులు పాల్గొన్నారు.