ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!
(J. Surender Kumar)
జగిత్యాల, అక్టోబర్ 9: మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

ఆదివారం జగిత్యాల పట్టణంలోని స్పైసి కిచన్ హల్లో జమాతే ఇస్లామి హింద్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా “మహమ్మద్ ప్రవక్త అందరికి ఆదర్శం” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచానికి శాంతిని బోధించడానికి మహమ్మద్ ప్రవక్త పాటుపడ్డారని, మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మంచి కార్యక్రమాన్ని జమాతే ఇస్లామీ హింద్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
గంగ జమున తహజిబ్ వలె అందరూ కలిసి ఉంటామని.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని మతాల పండుగలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నాం అని అన్నారు..
కొందరు కుల మతాలను రెచ్చ గొట్టి రాజకీయం చేస్తున్నారు అని అందరూ అప్రమత్తం గా ఉండాలని అన్నారు..నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మాన్ని,మతాన్ని గౌరవించుకుంటు ఉన్నపుడే దేశం శాంతి యుతంగా ముందుకు పోతుందని,అందరూ కృషి చేయాలని అన్నారు.
మహమ్మద్ ప్రవక్త మానవాళికి మార్గదర్శి అని, ఆయన తన ప్రవచనాలతో మనవాళిపై అద్భుత ప్రభావం చూపించారన్నారు. అనంతరం ప్రజలందరికీ మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు ఇమాద్ ఉద్దీన్ ఉమైర్, షోయబుల్ హాక్, గౌస్ ఉర్ రహమాన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం ప్రభాకర్, సీనియర్ న్యాయవాది బండ భాస్కర్ రెడ్డి, జిల్లా టియుడబ్ల్యూజె అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు, ఫజల్ ఉల్లా బైగ్, సలహాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి కార్యకర్తల సమావేశం !

బీర్పూర్ మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.. రాష్ట్ర నాయకులు శైలంధర్ రేడ్డి నరసింహుల , తుంగూరు గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా
శైలంధర్ రేడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. నరెంధ్ర మోడి చేస్తున్నటువంటి పతకాలను ప్రజల లోకి తీసుకువేల్లాల్సిన భాద్యత కార్యకర్తలదెనని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని , రాష్ట్ర ప్రభుత్వం వైపల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు

యువమోర్చ అధ్యక్షులు రంగు వంశికృష్ణ ,కిసాన్ మోర్చ అధ్యక్షులు ఆడెపు సత్తన్న ,దళిత మోర్చ అధ్యక్షులు నారపాక ప్రభాకర్ ,STగిరిజన మోర్చ చిక్రం మారుతి
జిల్లా కార్యవర్గ సభ్యుడు బూట్ల మార్కండేయ ,శక్తి కేంద్రాల ఇంచార్జి రఘవీరరేడ్డి ,మండల ఇంచార్జి పిల్లి శ్రీనివాస్
సారంగాపూర్ మండల అధ్యక్షులు ఎండబెట్ల అరుణ్ కుమార్ యువ మోర్చ దీటి వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం!

జగిత్యాల పట్టణ స్వాగత్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పట్టణ నూర్ భాషా (దూదేకుల) సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని . నూతన కార్యవర్గానికి శుభా కాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో
రాష్ట్ర నాయకులు మొహమ్మద్ బాబు జానీ, హసీనా, సోకురాబి, జగిత్యాల అధ్యక్షులు అబ్దుల్ అజీమ్, కార్యవర్గ సభ్యులు, TRSV పట్టణ అధ్యక్షులు ఎం.ఏ. ఆరీఫ్,.సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
