మానవత విలువలను బోధిస్తుంది !

కలెక్టర్ రవి!


(J. Surender Kumar)
మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శాలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందని జడ్చర్ల జిల్లా కలెక్టర్ రవి అన్నారు.,

శ్రీ ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
రామాయణ మహాకవ్యాన్ని మానవాళికి అందించి సీతారాముల జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ధర్మస్థాపన గావించిన ఆదికవి అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, అరుణ శ్రీ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో


జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ వారి చిత్రపటానికి పూలమాల ఘన నివాళులు అర్పించారు…
నేడు రామ కావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చైర్ పర్సన్ ప్రజలందరికీ శ్రీ మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కు క్షమాపణ చెప్పు!
క్షుద్రపూజలు చేసేది మీరూ
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్


లోకకల్యాణం కోసం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హోమాలు, యజ్ఞాలు చేస్తే… కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని… బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడడంపై చొప్పదండి శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని, తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రజల చేతిలో బండి చెంపదెబ్బ తినక తప్పదని హెచ్చరించారు. బండివి పిచ్చిమాటలు, చిల్లర వ్యాఖ్యలని. కచ్చితంగా అతన్ని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
కరీంనగర్ లో ఏం చేసావో.. చెప్పు బండి..
పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ కు ఏంచేసావో చెప్పు బండి సంజయ్.. ఇక్కడ చెప్పబుద్ది కాకపోతే మునుగోడు లో చెప్పు కరీంనగర్ కి గిన్ని కోట్లు తెచ్చిన, గింత అభివృద్ధి చేసిన అని.. చెప్పాలని డిమాండ్ చేశారు..

advertisement

జిల్లాకే ఏం చేయనోనివి.. రాష్ట్రానికి ఏమి చేస్తానని తిరుగుతున్నావ్… అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. మునుగోడు లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని అన్నారు.
కేసీఆర్ ప్రభంజనాన్ని తట్టుకోలేక..
కేసీఆర్ ప్రభంజనాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు తట్టుకోలేక.. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను దమ్ముంటే బీజేపీ పాలిత రాష్టాల్లో అమలు చేసి చూపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు..
దళితులపై దాడి దుర్మార్గపు చర్య !
నిందితులను కఠినంగా శిక్షించాలి..


ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ !
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండల గ్రామమైన మందపల్లిలో, దసరా రోజు సర్పంచ్, మండల వైస్ ఎం పి పి, సమక్షంలోనే దళితులపై జరిగిన దాడి దుర్మార్గపు చర్య అని నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ డిమాండ్ చేశారు.
ఆదివారం జగిత్యాల ఎస్ఆర్ఎస్పీ గెస్ట్ హౌస్ లో జరిగిన టిపిఎస్ జేఏసీ, టిఎవైఎస్ సమావేశంలో పాల్గొన్న. భాస్కర్ మాట్లాడుతూ, దసరా ముందు రోజు దళితులు దుర్గాదేవి కి బోనాలు తీస్తే అక్కడి నిర్వహకులు అ బోనాల నైవేద్యాలను కుక్కలకు, కోతులకు వేసి అవమానించడమే కాకుండా, అనవాయితిగా కొట్టే డప్పులను కొట్టనీయకుండ చేసి ఉత్సవంలో పాల్గొనకుండా కులవివక్షకు గురిచేశారన్నారు. మరసటి రోజు మాట్లాడుదామన్న సర్పంచ్, వైస్ ఎం పి పి,,ఇతర కులాల పెద్దల సమక్షంలోనే మాల, మాదిగ వేదవలారా, అంటు బిజెపి గ్రామ అధ్యక్షుడు కున భీమేష్, గుండవేణి నరేందర్, వొలాల దెవేందర్ తో పాటు మరికొందరితో కలిసి మూకుమ్మడిగా దాడి చేయడం కుల అహంకారనికి నిదర్శనమని దుయ్యబట్టారు. పోలీసులకు పిర్యాదు చేసిన రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తు కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటన పై స్థానిక ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్, మానవత దృక్పథంతో స్పందించాలని నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పేట భాస్కర్ కోరారు. మందపల్లి దళితులకు మద్దతుగా ఈనెల15 శనివారం రోజున ఖానాపూర్ లో నిర్వహించే దళితుల ఆత్మగౌరవ పోరాట ర్యాలీ ని విజయవంతం చేయాలని పేట భాస్కర్ పిలుపునిచ్చారు. ఈసమావేశంలో టిపిఎస్ జేఏసీ, టిఎవైఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కొంగర పవన్, బోనగిరి మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర రమేష్, నియోజకవర్గ అధ్యక్షులు కొడిపెల్లి సురేష్,.జిల్లా నాయకులు జాగర్ల రాజయ్య, బంగారు దీపక్, మోతే రమేష్, చిర్ర చందు,మారంపెల్లి అంజీ,.గణేష్ తదితరులు
పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం!
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్


బోయినిపల్లి మండల కోడూరుపక గ్రామానికి చెందిన 14 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
పరామర్శ!.


పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం, పత్తి పాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదుల్ల అంజయ్య కుటుంబాన్ని మాజీ జడ్పీ చైర్మన్ లక్ష్మణ్ కుమార్ ఆదివారం పరామర్శించారు. ఇటీవల అంజయ్య భార్య మృతి చెందగా వారి కుటుంబానికి,5000 రూ. 50 కిలోల బియ్యం ఆర్థిక సాయం చేశారు.
వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన ఉప్పు తిరుపతి కుమారుడు పాము కాటు తో వారి కుటుంబ సభ్యులను. పరామర్శించి ఓదార్చారు.


వెంట వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, నాయకులు సత్యనారాయణ రావు, కాంగ్రెస్ పార్టీ కిషన్ రావుపేట గ్రామ శాఖ అధ్యక్షులు సత్యం తదితరులు ఉన్నారు