(J.Surender Kumar)
ముంబై మహానగరంలో నివాసం ఉంటున్న ధర్మపురి క్షేత్రానికి చెందిన. బ్రాహ్మణ మహిళలు, ఆదివారం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

బోరువెల్లి ( పశ్చిమ ) లోని రఘువీర్. టవర్ కాంప్లెక్స్ లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. సనాతన సాంప్రదాయ బతుకమ్మ పద్ధతుల. ఆచరిస్తూ, పరస్పరంగా ఒకరినొకరు ఆనందం ఆ లింగణం చేసుకుంటూ, వారి వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

గత ఐదు సంవత్సరాలుగా ఇలానే బతుకమ్మ సంబరాలు ముంబై నగరంలో వారు నిర్వహించుకుంటున్నారు.

ముంబై మహిళా సంఘా అధ్యక్షురాలు రావులపల్లి సమత, ఉపాధ్యక్షురాలు తాడూరి యశోద, బతుకమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్ బుగ్గారపు సుధ, ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగాయి.