మూగజీవాలకు ఆపద్బాంధవుడు..
ఇంటి పేరే “పశువులు”


(J. Surender Kumar)
మూగజీవాల పాలిట అందుబాటులో ఉండే ఆపద్బాంధవుడు అతడు,

ఆ మూగజీవాలకు మాట్లాడగలిగే అవకాశం ఉండి ఉంటే, అతడు వాటికి అందించిన, అందిస్తున్న సేవలు తెలుసుకొని “ఔరా” అంటూ ఆశ్చర్యపడేవారము కావచ్చు. .దాదాపు నాలుగు దశాబ్దాలుగా పశువులకు అందిస్తున్న వైద్య సేవలకు కాబోలు, అతని ఇంటి పేరును మరిచిపోయినా పలువురు రైతులు పశువుల దేవయ్య అంటేనే ఆయన అడ్రస్, తెలుస్తుంది. ఇంటి పేరుతో ఆకుల దేవయ్య అంటే, ఎవరు అంటారు.
ధర్మపురి పశు వైద్య కేంద్రంలో 1975.లో ఆకుల దేవయ్య నాలుగవ తరగతి ఉద్యోగిగా విధుల్లో చేరారు. పశువైద్యుడికి చేదోడుగా, ఉంటూ విధులు నిర్వహించాలి.


గత మూడు దశాబ్దాల క్రితం పశు వైద్య సేవలు అందుబాటులో ఉండేవి కావు, మారుమూల గ్రామీణ ప్రాంతాలు, దోనూర్ , నక్కల పేట, జైన ,రాజారాం, బీర్పూర్, మంగళ, తుంగూర్, నేరెళ్ల ,వెలుగొండ ,తదితర గ్రామాలలో రైతులు తమ పశువులు. అనారోగ్య భారీ పడిన సందర్భాల్లో ధర్మపురి ఆసుపత్రికి తీసుకువచ్చేవారు. పశు వైద్యుడు అందిస్తున్న చికిత్స విధానం, వాటికి సంక్రమించిన వ్యాధుల పట్ల అవగాహన తో దేవయ్య, వైద్యుడు అందుబాటులో లేని సమయంలో ఆయన అనుమతితోనే పశువులకు వైద్య సేవలను అందించేవాడు. మూగజీవాల పట్ల, వాటి యజమానుల రైతుల పట్ల తన సర్వీస్ కాలంలో నిర్లక్ష్య వైఖరిని, దురుసుగా ప్రవర్తించేవాడు కాదు, వారితో పాటు బాధను వ్యక్తం చేస్తూ, మీ ఎద్దూ కు మీ బర్రెకు, నీ మేక ,గొర్రెలకు, ఏం కాదు అంటూ వారికి ధైర్యం చెబుతూ, సేవలు అందించేవాడని రైతులు అనేక సందర్భాల్లో. గ్రామాల్లో చర్చించుకోవడం పరిపాటి, 2010 లో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్న దేవయ్య , నేటికీ రైతులు తమ పశువుల అనారోగ్యం భారీన పడినప్పుడు దేవయ్యను సంప్రదిస్తారు. అర్ధరాత్రి ,అపరా రాత్రి, పండగ, పబ్బం అయినా సరే పట్టించుకోకుండా రైతుల వెంట వారి గ్రామాల్లోకి వెళ్లి పశువులకు వైద్య సేవలను అందించడం పరిపాటి. ఆయనను 108 పశువుల దేవయ్యగా ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. డబ్బులు డిమాండ్ చేయడు,
రైతులు రాస్తారోకో..
గత రెండు దశాబ్దాల క్రితం దేవయ్యను ధర్మపురి ఆసుపత్రి నుంచి ఇతర ప్రాంతానికి ఉన్నతాధికారులు రెండుసార్లు బదిలీ చేశారు. రెండు సందర్భాల్లోను రైతులు. దేవయ్య బదిలీ రద్దు చేయాలంటూ రాస్తారోకో చేసి బదిలీ రద్దు చేయించారు. ఎడ్లు, ఆవులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, కోళ్లు, తదితర మూగజీవాల కు విసుగు చెందకుండా. నేటికీ వైద్య సేవలు అందించడం లో దేవయ్యకు సాటి పోటీ లేరు.
సన్మానం!


మూగజీవాలకు దేవయ్య అందిస్తున్న, నిస్వార్థ వైద్య సేవలను గుర్తించిన, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విజయదశమి (దసరా) మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, సంఘ అధ్యక్షుడు రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు, దేవయ్య పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.