(J. Surender Kumar)
మూడు రాజకీయ పార్టీల భవిష్యత్తు తో ముడిపడి ఉన్న మునుగోడు ఉపఎన్నికల ఫలితాలలో మునిగేది ఎవరో ? విజయం సాధించేది ఎవరో ? అనే రాజకీయ చర్చలు విశ్లేషణలు, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు ఈనెల 3న తెరపడి. 6న ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసింది.
ప్రస్తుతం ఈ ఎన్నికలలో కాంగ్రెస్ , బిజెపి అభ్యర్థి విజయం సాధించిన అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం లేదు. అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గెలిచిన ఆ పార్టీకి అదనంగా చేకూరే లాభము లేదు.. కానీ ఈ ఎన్నికలు బిజెపి పార్టీ అగ్ర నేతలు ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్షాలకు సీఎం కేసీఆర్ మధ్యన నువ్వా ? నేనా ? అనే తరహాలో పోటీ నెలకొన్నది వాస్తవం

ఇది ఇలా ఉండగా మూడు పార్టీలకు చెందిన కొందరు నాయకులు, పార్టీలు మారడానికి మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలే ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు చర్చ నెలకుంది.
పోలింగ్ కోసం సర్వం సిద్ధం !
మునుగోడు లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్
మునుగోడు లో 2.41 లక్షల మంది ఓటర్స్.
అన్ని పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తి చేశాం.
అన్ని పోలింగ్ బూత్ లలో వెబ్ కాస్టింగ్.
ఈసారి ఐటీ టీమ్స్ తిరుగుతున్నాయి.
ఉదయం 7 గంటల నుండి 6PM పొలింగ్ సమయం.
రంగంలోకి ఫ్లయింగ్ స్క్యాడ్ తో సహా, 51 టీమ్స్.
తొలి సారి కొత్తగా డిజైన్ చేసిన ఐడీ కార్డ్స్.
మునుగోడు లో 3.366 స్టేట్ పోలీస్ 15, కంపెనీల సెంట్రల్ ఫోర్సెస్.
మొత్తం 5536, పోస్టల్ ఓట్స్ కానీ 739 మంది.
మాత్రమే పోస్టల్ బ్యాలెట్స్ కి అప్లయ్ చేసుకున్నారు.
రేపు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం సమయం.
ఎన్నికలకు సంబంధించి బల్క్ మెసేజెస్ పంపకుడదు.
మునుగోడు లో 80 మంది సర్వీస్ ఓటర్స్. ఉన్నారు