టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో కీలక పరిణామం
సరైన ఆధారాలు లేవన్న న్యాయమూర్తి
ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ PC యాక్ట్ ఈకేసులో అప్లికెబుల్ కాదు
బ్రైబ్ అమౌంట్ లేక పోవటంతో రిమాండ్ తోసిపుచ్చిన ఏసీబీ న్యాయమూర్తి
41.CRPC నోటీస్ ఇచ్చి విచారించాలన్న న్యాయమూర్తి
( J. Surender Kumar )
తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్..

అందులో కీలక అంశాలు!
రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏ-1గా దిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏ-2 గా హైదరాబాద్ కు చెందిన నందకిశోర్, ఏ-3 గా .తిరుపతికి చెందిన సింహయాజులు పై కేసు నమోదు చేశారు. .ప్రలోభాల వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

అటు.. తెరాస ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ,.ఇచ్చిన ఫిర్యాదుకు మేరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు కీలకాంశాలు పేర్కొన్నారు. .భాజపాలో చేరితే తనకు వంద కోట్లతోపాటు , కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురి చేశారని రోహిత్ రెడ్డి చెప్పినట్లు ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంచేశారు.
శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుండి భారీ బందోబస్తు నడుమ TRS ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారనే కేసులో
ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద ప్రవేశపెట్టిన పోలీసులు