నరసింహుడిని దర్శించుకున్న సీఎం ఓ ఎస్ డి!

(J. Surender Kumar)

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సోమవారం సీఎం కేసీఆర్ ఓఎస్డి (Health ) Dr గంగాధర్ తాడూరి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

దేవస్థానం సాంప్రదాయం ప్రకారం సాదరంగా స్వాగతం పలికిన పిదప వారు అభిషేకం లో పాల్గొన్నారు.
అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటి సభ్యులు, ఇందారపు రామయ్య స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటం బహుకరించారు.


దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు, అక్కనపల్లి సురేందర్ , ఇనగంటి రమ వెంకటేశ్వరరావు, గునిశెట్టి రవీందర్ , వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ,ముఖ్య అర్చకులు రమణయ్య, సిబ్బంది అర్చకులు పాపాల్గొన్నర

ADVERTISEMENT


మహా గౌరీ రూపంలో అమ్మవారి దర్శనం !


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శారదాంబ మాత మహా గౌరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది.


అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి. అమ్మవారిని ప్రత్యేక ఆభరణాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు.