పోడు భూములపై శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ రవి

(J. Surender Kumar)
పోడు భూములపై పంచాయతి రాజ్  సెక్రటరీలు, ఫారెస్ట్ అధికారులకు పోడు భూములపై శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి ముఖ్య అథితిగా పాల్గొన్నారు.


సోమవారం స్థానిక ధర్మపురి రోడ్డులో గల SVLR గార్డెన్స్ లో పోడు భూములపై పంచాయతి సెక్రటరిలకు, ఫారెస్ట్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూముల గురించి ఫీల్డ్ లో వెళ్లి ఎంక్వయిరీ చేసే విధంగా ఉండాలని, అది ఆఫీస్ లో కూర్చొని చేసే పని కాదని కలెక్టర్ వివరించారు. పోడు భూముల గురించి ఫీల్డ్ సర్వే కు వెళ్ళే ఒక రోజు ముందుగానే మెజారిటి మెంబర్స్ కో-ఆర్డినేట్ చేసుకొవాలని సూచించారు. ఎంక్వయిరీ చేయడానికి వెళ్ళినప్పుడు యాప్ లో మాత్రమే కాకుండా ఫీల్డ్ లో ఎవరు ఎవరు వెళ్లారు అనేది ఒక ఫోటో తీసుకొని డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రక్రియ మొత్తం 15 రోజుల్లోగా పూర్తీ చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  బి.ఎస్.లత, ఆర్డీఓలు  మాధురి, వినోద్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతి అధికారి నరేష్, వివిధ శాఖల  అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ లో ఇద్దరు మవోయిస్టులు ముగ్గురు సానుభూతిపరులతో సహ ఐదుగురు అరెస్ట్


సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులతో పాటు మరో ముగ్గురు సానుభూతిపరులను టాస్క్ఫ ర్స్ మరియు హనుమకొండ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన మావోయిస్టుల నుండి పోలీసులు 50 జిలిటెన్ స్టిక్స్, 50 డిటనేటర్లు, 74వేల రూపాయల నగదు, విప్లవ సాహిత్యం , ఒక బోలెరో కారు, సెల్ ఫోన్లు, అధార్ మరియు ఎన్నికల గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో
*1. మడకం ఉంగి అలియాస్ కమల, (దండకారుణ్య సౌత్ సబ్ జోన్ డాక్టర్స్ టీం కమాండర్) తండ్రి పేరు జోగయ్య, వయస్సు 30, ముంతమడుగు గ్రామం, పామెడు తాలుకా, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం.*
*2. అసం సోహెన్ (మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు, నేషనల్ ఏరియా), తండ్రి పేరు సమ్మయ్య, వయస్సు 35, కండ్లపర్తి గ్రామం, భూపాల్ పట్నం తాలూకా, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం .*
*3. మీచ అనిత ( క్రాంతికారి ఆదివాసి మహిళ సంఘ్ అధ్యక్షురాలు, మవోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ),తండ్రి పేరు మర, వయస్సు 21,కండ్లపర్తి గ్రామం, భూపాలపట్నం తాలూకా, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం.*
*4.గొడ్డి గోపాల్, (ఆర్.పి.సి అధ్యక్షుడు), తండ్రి పేరు బుచ్చయ్య, వరదల్లి గ్రామం, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం.
*5. కందగుర్ల సత్యం ,తండ్రి పేరు పోచయ్య, నల్లంపల్లి, భూపాల్ పట్నం తాలూకా, బీపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం.*
ఈ అరెస్టుకు సంబందించి సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్ వివరాలను సోమవారం వివరించారు.
మావోయిస్టులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన
టాస్క్ ఫోర్స్ డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏసిపి  జితేందర్ రెడ్డి, హనుమకొండ ఏసిపి  కిరణ్ కుమార్, టాస్క్ ఫోర్స్, హనుమకొండ .ఇనన్స్ స్పెక్టర్లు  సురేష్ కుమార్,  శ్రీనివాస్ టాస్క్ ఫోర్స్ , హనుమకొండ ఎస్.ఐలు లవణ్ కుమార్, నిసార్ పాషా,  రాజు,  ఉమ, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్లు  శ్యాంసుందర్,  సోమలింగం, మాధవరెడ్డి, అశోక్,స్వర్ణలత, కానిస్టేబుళ్ళు నవీన్, శృజన్, శ్రవణ్ కుమార్, నాగరాజు, రాజు, సురేష్, శ్యాం సుందర్, శ్రీధర్, శ్రీనులను సెంట్రల్ డిసిపి అభినందించారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి.


దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్  రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్నo కిషన్ రెడ్డి, ధ్యావర  సంజీవరాజు, జిల్లా అధ్యక్షుడు ఎన్.జయపాల్,జిల్లా కార్యదర్శి వెంకట రమణలు అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాలలో జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమాన్ని కలెక్టరేట్ ముందు జర్నలిస్ట్ సమస్యలపై శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్   సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.