పోలీస్ అమరవీరుల సంస్మరణ లో రక్త దాన శిబిరం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  ఆధ్వర్యంలో

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ లో భాగంగా  పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని అమరవీరుల త్యాగలను స్మరిస్తూ  జగిత్యాల జిల్లా పోలీస్ ల అద్వర్యంలో గురువారం  విరుపాక్షి గార్డెన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ముఖ్య అతిథిగా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ, పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎస్పీ   డీఎస్పీ .ప్రకాష్  వివిధ సర్కిళ్ల సి. ఐ లు, ఎస్.ఐలు,మరియు పోలీస్ సిబ్బంది, యువత, స్వచ్ఛంద రక్తదానం చేశారు.  సుమారు 150 యూనిట్ల రక్తాన్ని ll రెడ్ క్రాస్ సొసైటీ వారు సేకరించడం జరిగింది.


ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… పోలీస్  అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి  తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. అమరుల త్యాగ ఫలంగానే ఈరోజు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు.మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే అమరుల త్యాగానికి నిజమైన నివాళి అని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతిఏటా పోలీస్ ప్లాగ్ డే ని నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు.

ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి  రక్తదానం చేయాలని సూచించారు. ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రకాష్ రవీంద్ర రెడ్డి సీ.ఐలు కిషోర్, కృష్ణకుమార్, రమణమూర్తి, కోటేశ్వర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వామనమూర్తి, నవీన్ మరియు ఎస్.ఐ  లు, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, యువత,  పాల్గొన్నారు.


పోలీస్ ల  సైకిల్ ర్యాలీ!


పోలీస్‌ అమరవీరుల సంస్మరణ లో భాగంగా  పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని అమరవీరుల త్యాగలను స్మరిస్తూ జిల్లా పోలీస్  సైకిల్ ర్యాలీ లో  జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ పాల్గొన్నారు.
జగిత్యాల లోని ఓల్డ్ బస్ స్టాండ్  నుండి  తహసిల్ చౌరస్తా  గుండా కొత్త బస్టాండ్  వరకు  సైకిల్ ర్యాలీ జరిగింది
అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ……దేశ వ్యాప్తంగా ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన పోలీస్ వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని చెప్పారు. .పోలీసుల అమరవీరుల వారోత్సవాలాల్లో భాగంగా, విద్యార్థిని/విద్యార్థులకు,  వ్యాసరచన పోటీలు, , ఓపెన్ హౌస్, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ సైకిల్ ర్యాలీ,  రక్తదానం శిబిరం కార్యక్రమలు నిర్వహించడం జరిగినదని అన్నారు .


సైకిల్ ర్యాలీలో  డీఎస్పీలు ప్రకాష్ , రవీంద్ర రెడ్డి .సీ.ఐలు కిషోర్,. కృష్ణకుమార్, రమణమూర్తి, కోటేశ్వర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వామనమూర్తి, నవీన్ మరియు ఎస్.ఐ  లు, పోలీస్ సిబ్బంది, యువత, విద్యార్థిని, విద్యార్థులు   పాల్గొన్నారు.