పోలీస్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ సంబరాలు!


(J.Surender Kumar)
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయం లో ఆదివారం పోలీస్ అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాలలో ఎస్పీ సింధు శర్మ కోలాటలు, బతుకమ్మ ,ఆడి అంగరంగ వైభవంగా బతుకమ్మఆడి అందరిలో ఉత్సవాన్ని నింపారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ..పోలీసువారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడటం కుటుంబ సభ్యులను కలిసి వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు..‘బతుకమ్మ’ బతుకుని కొలిచే పండుగ. ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం మన తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని, తెలంగాణ సంస్కృతిని తెలిపే ఈ పండుగ విశిష్టత తరతరాలుగా కొనసాగుతూ, ఐకమత్యాన్ని పెంపొందించాలని కోరుతూ, పోలీస్ కుటుంబ సభ్యులు, అందరూ కలిసి అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నందుకు ఆనందం వ్యక్తం చేసి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.