ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం !

ఎమ్మేల్యే డా.సంజయ్. కుమార్!


(J. Surender Kumar)
సారంగాపూర్ మండల లక్ష్మీదేవి పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కి చెందిన వార్డు మెంబర్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కుంటాల నర్సయ్య,  వారి అనుచరులు 20 మంది ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి  ఎమ్మెల్యే  స్వాగతించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే పార్టీ బలంగా ఉండాలని అన్నారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం రాకముందు తేడా పోలిస్తే సరిపోతుందని అన్నారు.
కొందరు అభివృద్ధి నిరోధకులు కుల మత వర్గాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాల లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం పచ్చదనం పరిశుభ్రతతో అద్దంలా తయారైందని అన్నారు.
గ్రామాలకు పట్టణాల నుండి వలసలు పెరిగాయి అని,ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారని అన్నారు.
రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు మిషన్ కాకతీయ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శమని అన్నారు  రైతు బీమా ద్వారా రైతు ఏ కారణంతో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఐదు లక్షల రూపాయలు జమవుతున్నాయని ఎలాంటి పైరవీలు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు అని అన్నారు
దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఎన్నో సంవత్సరాలుగా దళితులు అంటరాని వారిగా చూశారని అలాంటి భావం లేకుండా ఉండడానికి ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి గారు ఈ పథకం తీసుకొచ్చారని అన్నారు.
ప్రతి ఒక్క దళిత బిడ్డ ఆర్థికంగా ఎదగడానికి దళిత బంధు ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ వృత్తి విద్య కోర్సులు నేర్చుకొని దళిత బంధు పథకాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు.
మిషన్ భగీరథ పథకానికి కేంద్రం అవార్డు ప్రకటించింది అని చాలా సంతోషకర విషయం అని,కేంద్రం నుండి 19వేల కోట్లు మిషన్ భగీరథ పథకానికి రావాల్సిన అవశ్యకత ఉందని అన్నారు.
కేంద్రం అవార్డు లు ఇస్తూ నిదులు మాత్రం ఇవ్వకపోవడం ఇక్కడి నాయకుల వైఫల్యమే అని అన్నారు.
ప్రపంచంలోకెల్లా అత్యధికంగా యువత భారతదేశంలోనే ఉందని యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు మాత్రం వెనుకబడి ఉందని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యువతకు సరైన మార్గ నిర్దేశం లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా 1,50,000 ఉద్యోగాలు ఐటి ఇతర ప్రైవేటు లో 12 లక్షల ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేదవాడి నడ్డి విరుస్తుందని ఎద్దేవా అన్నారు..
అన్ని వర్గాలకు అండగా ఉంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ముఖ్యమంత్రిగా నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో KDCC జిల్లా మెంబర్ రాంచందర్ రావు, జడ్పిటిసి మనోహర్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు గుర్రాల రాజేందర్రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, మండల రైతు బంధు సమితి కన్వీనర్, కొల శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, సుధాకర్ రావు, నాయకులు మర్రి కంటి మల్లేశం, సాంబారి గంగాధర్, శేకర్, గంగారాజం, భీమా నర్సయ్య, నరసింహుల పల్లే సర్పంచ్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
జగిత్యాలలోఅంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం


ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో  జగిత్యాల జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ,అడిషనల్ కలెక్టర్లు అరుణ, శ్రీ,లత
ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి,భద్రతకు,వారు గౌరవంగా జీవించేందుకు అవసరమైన సహాయం అందిస్తుంది.


ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వృద్దులకు నేనున్నానంటూ ఇంటికి పెద్దకొడుకు వలే ఆదుకుంటూ ఆసరాగా నిలుస్తున్నారు.
రాష్ట్రంలో ఆసరా పెన్షన్ ద్వారా వృద్దులకు నెలకు 2016/- అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ, ముఖ్యమంత్రి ఒక్క కెసిఆర్ మాత్రమే.
రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో వృద్ధాశ్రమాలు నడుపబడుతున్నాయి.
వయోవృద్ధుల సహాయార్ధం 14567 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడమైనది.


కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ,DWO నరేష్ ,జిల్లాల సంక్షేమ అధికారులు, సీనియర్ సిటిజన్స్,  ప్రతినిధులు పాల్గొన్నారు.
బతుకమ్మ సంబరాలు !


జగిత్యాల పట్టణ పద్మనాయక కళ్యాణ మంటపం లో RK ,NSV,  వైష్ణవి ,డిగ్రీ కళాశాల అధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు కార్యక్రమానికి హాజరై బతుకమ్మ ఆడిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ , జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్


ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, విద్యాసంస్థలు కరస్పాండెంట్, రామ కృష్ణ, క్యాంప్ రామాలయ ఛైర్మెన్ బ్రహ్మాండ నరేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు..
గ్రామపంచాయతీ భవన ప్రారంభం.!


జగిత్యాల రూరల్ మండల (అంతర్గం) ఓడ్డెర కాలనీ లో RGSA నిధులు ₹20 లక్షలతో నూతనంగా నిర్మించిన  గ్రామ పంచాయతీ భవనాన్ని  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జడ్పీ ఛైర్ పర్సన్ దావా వసంత సురేష్ . ప్రారంభించారు.

.అనంతరం నూతనంగా మంజూరైన పెన్షన్ కార్డ్ లను , బతుకమ్మ చీరలను, కళ్యాణ లక్ష్మి,. చెక్కులను లబ్దిదారులకు  ఎమ్మెల్యే,జెడ్పీ చైర్ పర్సన్. పంపిణీ చేశారు


ఈ కార్యక్రమంలో ఎంపీపి రాజేంద్ర ప్రసాద్, ,AMC ఛైర్మెన్ నక్కల రాధ, సర్పంచులు  కుంచెపు రాజమని గంగాధర్, బోనగిరి నారాయణ, ఎంపీటీసీ భూపెళ్లి శ్రీనివాస్, ఉప సర్పంచులు, కుంచెపు నాగవ్వ లక్ష్మణ్, రైతు బంధు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం,.సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకు జాన్, .ఎంపిడివో రాజేశ్వరి, ఎమ్మార్వో నవీన్, ఎంపీవో రవి బాబు, ఎస్ఐ ,అనిల్, DE మీలింధ్,.AE రాజ మల్లయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు,
నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు…