ఏపీ మంత్రి ధర్మన్న ప్రసాద్ రావు.
(J.Surender Kumar)
సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఒక్క రచయితలకు మాత్రమే ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

ఆదివారం శ్రీకాకుళం లో సీనియర్ జర్నలిస్ట్ జి.వల్లీశ్వర్ రచించిన 99 సెకండ్లు కథలు, పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజానికి మంచి మార్గంలో నిలిపే శక్తి కూడా రచయితలకు, సాహితీవేత్తలు లకు మాత్రమే ఉందన్నారు.

ఏ వృత్తిలో ఉన్న వారు అయినా విలువలు, పాటిస్తూ ముందుకు వెల్లాలని ఆయన ఆకాక్షించారు. జర్నలిజంలో నిబద్ధత, నిస్పాక్షిత కలిగిన పాత్రికేయునిగా, వల్లీశ్వర్ పేరు తెచ్చుకున్నారని మంత్రి కొనియాడారు. మూడున్నర దశబ్దాలుగా పాత్రికేయు వృత్తిలో ఉంటూ, వారి రచనలతో సమాజాన్ని జాగృతం చేశారని అన్నారు.

ధర్మాన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించికొనే భాగ్యము కలిగినందుకు మంత్రి సంతోషించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, అట్టాడ అప్పలనాయుడు, కార్పోరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, సీనియర్ జర్నలిస్టులు శశాంక్ మోహన్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురిలో శాకాహార ర్యాలీ !

ఆదివారం ధర్మపురి పుణ్య క్షేత్రం లో పిరమిడ్ స్పిరిట్యుయల్ సొసైటీ మూవమెంట్ వారి ఆధ్వర్యంలో
కరీంనగర్, మరియు జగిత్యాల పిరమిడ్ మాస్టర్స్ సంయుక్త సహకారం తొ శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారతీయ సనాతన ధర్మం అయిన అహింస పరమోధర్మ నినాదం తొ మూగ జీవుల, పరిరక్షణ కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, మాంసం భక్షణ ద్వారా అనేక రోగాలు మానవుడు కొని తెచ్చుకుంటున్నాడు, సంపూర్ణ ఆరోగ్యం. శాకాహార తోనే సాధ్యం,.అందుకని ప్రతి మానవుడు శాఖహరిగా మారాలి, అలాగే మానవుడి మానసిక ప్రశాంత త కోసం, ఆత్మజ్ఞానం,.ముక్తి,మోక్షం కావాలంటే ధ్యానం చేయటం, శాకాహారo ద్వారా నే సాధ్యం అని ఈ ప్రోగ్రాం organiser సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనిల్ కుమార్ చింత,ఆనంద్ ప్రసాద్ గారు ,ఢిల్లీశ్వర్ పేర్కొన్నారు.

ఈ శాకాహార ర్యాలీ ని పట్టణ CI కోటేశ్వర్, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ ,.దేవాలయం చైర్మన్, ఇందారపు రామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, దేవాలయం E O శ్రీనివాస్ సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు.
అదనపు బాధ్యతలు!

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బీర్పూర్, ధర్మపురి క్షేత్రంలోని శ్రీ అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అదనపు బాధ్యతలను ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ దేవదాయ శాఖ అప్పగించింది.