కలెక్టర్ జి. రవి
(J.Surender Kumar)
సోమవారం జరిగిన ప్రజావాణికి 26 ధరఖాస్తులు రాగా, ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఐ ఎం ఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, అరుణశ్రీ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు.

ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
సీఎంఆర్ చెక్కుల పంపిణీ!

బీరుపూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన చుక్క వేంకటవ్వ ,₹21,000/_ పూడూరి జమున , ₹ 15,000/_ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, సర్పంచ్ గుడిసే శ్రీమతి జితేందర్ యాదవ్ సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రసారకమిటి అధ్యక్షుడు గుడిసే జితేందర్ యాదవ్ గారు మరియు ఉపసర్పంచ్ పుడూరి రమేష్ పాల్గొన్నారు.
దళితులను ఇబ్బంది పెడుతున్నారు!

బీర్పూర్ మండలం మంగెళ గ్రామంలో దళితులకు గత 35 సంవత్సరాల క్రితం కేటాయించిన భూములలో అటవీ అధికారులు పెడుతున్న ఇబ్బందులను తొలగించాలని మంగెళ గ్రామ దళిత మహిళలు మరియు దళితులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవికి వినతి పత్రం సమర్పించిన బిజెపి జిల్లా నాయకుడు చిలకమర్రి మదన్ మోహన్, ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా బీర్పూర్ అధ్యక్షులు నారపాక ప్రభాకర్, నారపాక అనిల్, జగిత్యాల దళిత మోర్చా అధ్యక్షుడు నక్క జీవన్, కంటె జశ్వంత్, హరికిరణ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
పరామర్శించిన ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి.

అర్బన్ మం. హస్నాబాద్ గ్రామానికి చెందిన సనుగుల తిరుపతి (17) అనే యువకుడు నిన్న విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందగా, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా విద్యుత్ ఘాతంతో యువకుడు తిరుపతి మృతి చెందడం బాధాకరమని కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జున్ను రాజేందర్, మాజీ సర్పంచులు బి. గంగాధర్, డి గంగాధర్,ఉప సర్పంచ్ రజిత, ఎంపీటీసీ. మల్లారెడ్డి, నాయకులు, అల్లాల రమేష్ రావు, జితేందర్, మల్లారెడ్డి, మహేందర్. సురేష్ , శేఖర్ తదితరులు ఉన్నారు.
