(J. Surender Kumar)
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.
సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఐ ఎం ఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 24 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, అరుణశ్రీ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, అరుణ శ్రీ, జగిత్యాల, ఆర్.డి.ఓ.లు మాధురి, వినోద్ కుమార్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యాసంస్థలు తరలించవద్దు. ప్రజావాణిలో వినతి!

బీర్పూర్ మండలానికి మంజూరి అయిన కస్తూరిబా బాలికల పాఠశాల మరియు బిసి బాలుర పాఠశాల తరలింపును అడ్డుకోవాలని వాటిని బీర్పూర్ లోనే కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ బీర్పూర్ మండల శాఖ తరపున ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి కి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీర్పూర్ బీజేపీ మండల ఇంచార్జి చిలుకమర్రి మదన్ మోహన్, మండల శాఖ బిజెపి అధ్యక్షులు మ్యాడ జనార్దన్, ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల మార్కండేయ, నాయకులు మారుతి, నరేందర్, తిరుపతి, మల్లేష్, గంగాధర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై ఎల్. రామ్ కు సేవా పతకం!

జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై గా భాద్యతలు తీసుకొన్న యల్. రామ్, విది నిర్వహణలో అనతి కాలంలోనే 1400 కేస్ లు పరిష్కరించి, పెండింగ్ చాలన్ల చెల్లింపు లో ఉత్తమ సేవలందించినందుకు రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఎస్ఐ రామ్ ను సేవా పథకానికి ఎంపిక చేశారు.
రేషన్ బియ్యం పట్టివేత!

మల్యాల మం. లంబాడిపల్లి గ్రామంలో అక్రమంగా రవాణా చేస్తున్న 8 క్వింటాళ్ళ రేషన్ బియ్యంను సోమవారం పట్టుకున్నట్టు మల్యాల ఎస్సై చిరంజీవి తెలిపారు.
గొల్లపెల్లి మం. గుంజపడుగు గ్రామానికి చెందిన గంధం అజయ్ పై కేసు నమోదు, XL వాహనం అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.