జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
( J.Surender Kumar)
దేశ రాజకీయాలనే అపహాస్యం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్రతో 400 కోట్లతో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ పార్టీ నాయకులు నిస్సిగ్గుగా బేరసారాలు ఆడటంపై మండిపడుతూ జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ , పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ నారాయణ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:-
👉మోడీ దేశ ప్రధాని ల కాకుండ వ్యాపార వేత్తల వ్యవహరిస్తున్నాడు అని అన్నారు.
👉పచ్చని తెలంగాణ లో బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుంది అన్నారు.
👉మౌనంగా మోసపోవడనికి మహారాష్ట్ర కాదు , ఉద్యమ గడ్డ తెలంగాణ అని అన్నారు.
👉కేసిఆర్ నాయకత్వములో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే ను కోట్ల రూపాయలు మరియు పదవుల ఆశ చూపి కొనలేరు అన్నారు.
👉కేసిఆర్ నాయకత్వంలో బీజేపీ కుట్రలు సాగవన్నరు.
👉గుజరాత్ గులాం లకు తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ది చెప్తారు అని అన్నారు.
👉స్వామీజీలు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలంటే సమాజానికి నాలుగు మంచి విషయాలు చెప్పాల్సినవారు ఇలాంటి పనులు చేయడం సరియైనది కాదు అని అన్నారు.
👉14 ఏండ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మనసును గెలుచుకున్నారని, మిగితా రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ బీజేపీ ఆకర్ష్ పని చేయదని, రానున్న రోజుల్లో కమలం పువ్వు వాడిపోవటం ఖాయమని చెప్పారు.
ధర్మపురి లో బిజెపి పార్టీ దిష్టి బొమ్మ దగ్ధం!

కోట్ల రూపాయల నగదు, పదవుల ఆశ చూపి బీఆర్ఎస్
పార్టీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రలను ఖండిస్తూ, గురువారం. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గలో పరిధిలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో ఆరు మండలాల్లో బిజెపి పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల లో నరేంద్ర మోడీ
దిష్టి బొమ్మ దహనం

స్థానిక కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీర్పూర్ మండలంలో ..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ రాజకీయాలనే అపహాస్యం చేస్తూ,తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్రతో 400 కోట్లతో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ పార్టీ నాయకులు నిస్సిగ్గుగా బేరసారాలు ఆడటంపై మండిపడుతూ ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గ ఆదేశాల మేరకు బీర్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో కొల్వాయిలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు..ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, జిల్లా రైతుబందు సమితి మెంబర్ కొలముల రమణ, కోల శ్రీనివాస్, జిల్లా నాయకులు అయిల్నేని సాగర్ రావు, రవీందర్ రావు, నారాయణ రావు, .చంద్రశేఖర్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు నారపాక రమేష్, రైతుబందు సమితి మండల అధ్యక్షుడు మెరుగు రాజేశం,.ఎక్స్ జడ్పీటీసీ ముక్క శంకర్, మండల ఉపాధ్యక్షులు రామకిస్టు గంగాధర్,.ఎస్సి మండల కమిటీ అధ్యక్షుడు ఉయ్యాల కిషన్, సర్పంచులు పర్వతం రమేష్, చిక్రం మారుతి ,చుంచు నరేందర్, మాజీ సర్పంచ్ రంగు మల్లేశం, నాయకులు దోసరపు బుచ్చన్న, అశోక్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.